YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆరు నెలల వేతనం కోసం పారిశుద్ద్య సిబ్బంది అందోళన

ఆరు నెలల వేతనం కోసం పారిశుద్ద్య సిబ్బంది అందోళన

ఆరు నెలల వేతనం కోసం పారిశుద్ద్య సిబ్బంది అందోళన
సిద్దిపేట ఫిబ్రవరి 19 
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ పారిశుద్ధ్య సిబ్బంది ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదంటూ గ్రామ కార్యదర్శిని పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిబ్బందితో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలపడంతో ఆందోళన విరమించారు. ఆరు నెలలుగా వేతనాలు లేక కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని, వేతనాలు చెల్లించాలని కార్యదర్శిని అడగగా,జీతాలు లేవు ఏం లేవంటూ పని బంద్ చేయండని, సిబ్బందిని చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వేతనాల విషయమై సర్పంచ్ ను సంప్రదిస్తే కార్యదర్శి పైన కార్యదర్శిని సంప్రదిస్తే సర్పంచ్ పైన చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిబ్బంది వాపోయారు. పనిలో చేరినప్పుడు బాండ్ రాయించుకున్నారని, బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోమంటే అకౌంట్ కూడా తీసుకున్నమని తమ అకౌంట్లో కూడా డబ్బులు జమ కావడం లేదని ఆరోపించారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని పై అధికారులు స్పందించి తమకు జీతాలు వచ్చేలా చేయాలని కోరుకుంటున్నారు.

Related Posts