YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపావి అనాలోచిత నిర్ణయాలు

వైకాపావి అనాలోచిత నిర్ణయాలు

వైకాపావి అనాలోచిత నిర్ణయాలు
కడప ఫిబ్రవరి 19
గ్రాఫిక్స్ కే పరిమితమై టిడిపి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే ప్రస్తుత  వైసిపి ప్రభుత్వం కూడా  అదే రీతిలో వ్యవహరిస్తూ అకృత్యాలకు పాల్పడుతుందని మాజీ కేంద్ర మంత్రి పురందరేశ్వరి విమర్శించారు. కడపలొ బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసి,  అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసనగా చేపట్టిన కార్యక్రమంలొ పాల్గొన్న అమె మాట్లాడుతూ వైసీపీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్టంలొ ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు. అధికారంలోకి వచ్చాక రాజధానిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, అవినీతి జరిగితే వాటిపై విచారణ చేయకుండా రాజధానిని మార్చడం తగదన్నారు. రాష్ట్ర గౌరవం కన్నా అరాచకాలే   ముఖ్యమన్న విధంగా సిఎం జగన్  వ్యవహరిస్తున్నారని అరొపించారు. ఇతర పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేస్తే ప్రతిఘటిస్తామని, బిజేపి కార్యకర్తలు చిందించే ప్రతి రక్తపు బోట్టుతో వందలాది కార్యకర్తలు పుట్టుకోస్తారని, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మాజీ మంత్రి ఆది చేసిన సవాల్ ను స్వీకరించడానికి జగన్ సిద్దమా అని ప్రశ్నించారు.

Related Posts