YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 బీజేపీ నేతలపై తప్పుడు కేసులు

 బీజేపీ నేతలపై తప్పుడు కేసులు

 బీజేపీ నేతలపై తప్పుడు కేసులు
కడప ఫిబ్రవరి 19 
పథకాలు అమలు చేస్తామంటూ కొతలు పెడుతున్న సిఎం వైఎస్ జగన్ కు ఎవరు సరిలేరని మాజీ మంత్రి బిజేపి నేత అదినారాయణరెడ్డి విమర్శించారు. కడపలొ బీజేపీ కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసనగా చేపట్టిన ధర్నా కార్యక్రమంలొ పాల్గొన అదినారాయణరెడ్డి  మాట్లాడుతూ సిఎం వైఎస్ జగన్  సొంత చిన్నాన్నా వివేకా హత్య చేసిందో తేలాలంటే సిబిఐ తో విచారణ జరగాలన్నారు. గుండెపోటుకు గురైనట్లు చెప్పి గుండెల్లో పోటు పోడిచిందెవరొ చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకా కుమార్తె సునీత సిబిఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా ఎందుకు జగన్ వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ముందు సిబిఐ తో విచారణ జరపాలని డిమాండ్ చేసి ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారన్నారు. సిఎఎకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్ రాజీనామా చేయాలని, అన్ని పథకాల విషయంలో  ప్రభుత్వం ప్రజలకు అలా వైకుంఠపురం సినిమా చూపిస్తుందని మండిపడ్డారు. సిఎం వైఎస్ జగన్ ఇక్కడ పులి అక్కడ పిల్లి అన్న చందంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు చరమగీతం పెట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. జమ్మలమడుగు లో పులి.. జగన్ దగ్గర పిల్లిలా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మారారని, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ అధికారులు బిజెపి నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ద్వజమెత్తారు.

Related Posts