YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

127 మంది జాబితాలో ముస్లింలు, దళితులు ఎంత మంది

127 మంది జాబితాలో ముస్లింలు, దళితులు ఎంత మంది

127 మంది జాబితాలో ముస్లింలు, దళితులు ఎంత మంది
హైద్రాబాద్, ఫిబ్రవరి 19 
హైదరాబాద్‌లో 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులివ్వడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ 127 మంది జాబితాలో ముస్లింలు, దళితులు ఎంత మంది ఉన్నారని ప్రశ్నిస్తూ తెలంగాణ పోలీస్, ఆధార్ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై తెలంగాణ డీజీపీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పౌరసత్వాన్ని పరిశీలించే అధికారం ఆధార్ సంస్థకు లేదని గుర్తు చేశారు. తెలంగాణ పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించే సమయంలో ఆధార్ అడగడం మానేయాలని సూచించారు127 మంది వ్యక్తులు తప్పుడు సమాచారంతో ఆధార్ కార్డు పొందారనే ఆరోపణలపై వీరికి యూఐడీఏఐ నోటీసులు జారీ చేసింది. వీరంతా ఒకరి తర్వాత మరొకరు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీపై ముస్లింలు దేశ వ్యాప్త పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 127 మందికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.మైనారిటీలు, దళితులు లక్ష్యంగానే ఈ వేధింపులు చేస్తున్నారని అసదుద్దీన్ ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే వారికి నోటీసులు జారీ చేసి అన్ని గుర్తింపు పత్రాలను మళ్లీ పరిశీలిస్తామంటున్నారని వివరించారు.

Related Posts