YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పంచగ్రామాల్లో యదేఛ్చగా అక్రమ నిర్మాణాలు

పంచగ్రామాల్లో యదేఛ్చగా అక్రమ నిర్మాణాలు

పంచగ్రామాల్లో యదేఛ్చగా అక్రమ నిర్మాణాలు
(విశ్లేషణ)
విశాఖ నగరంలోని పంచ గ్రామాల్లో శతాబ్దాలుగా సాగు చేస్తున్న, నివాసముంటున్న రైతులు, పేదలు చిన్నపాటి నివాసం కట్టుకుందామన్నా దేవస్థానం నిబంధనలు అడ్డంకిగా మారాయి. జీవిత కాలం ఉద్యోగాలు చేసి పిఎఫ్‌ డబ్బులతో స్థలాలు కొనుక్కున్న వాళ్లనూ ఇళ్లు కట్టుకోనివ్వడం లేదు. సింహాచలం దేవస్థానం అధికారులు, గార్డులు ఆగమేఘాల మీద వచ్చి ఇళ్ల నిర్మాణదారులను చితక్కొట్టి పనులను అడ్డుకుంటున్నారు. అవే స్థలాలను కారు చౌకగా కొంటున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మాత్రం దర్జాగా బహుళ అంతస్తులు కడుతున్నా దేవస్థానం అధికారులు చోద్యం చూస్తున్నారు. వేపగుంట నుంచి గోశాల జంక్షన్‌, గోపాలపట్నం నుంచి గోశాల బిఆర్‌టిఎస్‌ రహదారులకు ఇరువైపులా పలు అపార్టుమెంట్లు, కల్యాణ మండపాలు అక్రమంగా ఇప్పటికే వెలిశాయి. ప్రస్తుతం పలుచోట్ల అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ గృహాల నిర్మాణం జరుగుతోంది. అయినా, సింహాచలం దేవస్థానం అధికారులు, గార్డులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పంచగ్రామాలైన పురుషోత్తపురం, వేపగుంట, అడవివరం, వెంకటాపురం, చీములాపల్లిలో జరుగుతున్న తంతు ఇది. పంచగ్రామాల్లో 24 ఏళ్లుగా పేదలు, సామాన్యులు స్థలాలు అమ్ముకోలేక, నివాసాలు కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. 1996లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జిఒ మేరకు చినగదిలి, పెందుర్తి మండలాల తహశీల్దార్లు పంచ గ్రామాల్లోని 12,159 ఎకరాలకు సింహాచలం దేవస్థానానికి రైత్వారీ పట్టాలు జారీ చేశారు. దీంతో ఎప్పటి నుంచో అనుభవంలో ఉన్న రైతులు, నివాసదారులు అప్పటి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సైతం తమ భూములను, స్థలా లను అమ్ముకోలేకపోతున్నారు. ఇళ్లు నిర్మించుకోలేక పోతు న్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామన్న వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం హామీని నిలుపుకోలేక పోయింది. ఆ తర్వాత మళ్లీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 12,149 అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరి స్తామంటూ హామీ ఇచ్చింది. అందుకు బదులుగా దేవస్థానానికి పద్మనాభం, అనందపురం, అనకాపల్లి మండలాల్లో 419 ఎకరాలు ఇస్తామని చెప్పింది. అయితే, దీన్ని సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజు, ఇఒ తిరస్కరించారు. మరోవైపు ఈ భూములన్నింటినీ దేవస్థానం ఆధీనంలోనే ఉంచాలంటూ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి హైకోర్టులో కేసులు వేశారు. దేవస్థానానికి డబ్బులు చెల్లిస్తే స్థలాలు, నిర్మాణాలను క్రమబద్దీకరిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే కొనుక్కున్న స్థలాలకు మళ్లీ డబ్బులు చెల్లించడానికి నివాసదారులు అంగీకరిం చలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి సమస్య పరిష్కారానికి ఇద్దరు మంత్రులతో కమిటీని నియమించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విశాఖ జిల్లాకు చెందిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజు, ఆలయ ఇఒ రెండుసార్లు సమావేశమైన తర్వాత శారదా పీఠాధిపతితో భేటీ అయ్యారు. తర్వాత ఈ సమస్యపై మాట్లాడటం మానేశారు. కోర్టులో తేలాక చూద్దామంటూ చేతులెత్తేశారు. దీంతో, ఎనిమిది నెలలైనా సమస్య అలాగే ఉంది. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వైసిపి ప్రభుత్వమైనా ఈ సమస్యను పరిష్కరిస్తుందో? లేదో? వేచి చూడాలి.కోర్టు కేసులు, దేవస్థానం అధికారులు ఇవేమీ రియల్టర్ల నిర్మాణాలను అడ్డుకోకపోవడం వెనుక అసలు రహస్యం ఏంటి? 24 ఏళ్లుగా ఇళ్లు కట్టుకోలేక నిస్సహాయ స్థితిలో ఉన్న పేదల నుంచి రియల్టర్లు చౌకగా భూములను కొంటున్నారు. కొందరు దేవస్థానం అధికారులను, ప్రజా ప్రతినిధులను, జివిఎంసి అధికారులను తమదైన రీతిలో మచ్చిక చేసుకుంటున్నారు. నెలల్లోనే కళ్లు చెదిరే అంత స్థులు నిర్మిస్తున్నారు. తర్వాత పది నుంచి ఇరవై రెట్లు లాభాలకు ఫ్లాట్లను అమ్ముకుంటున్నారు. రియల్‌ ఎస్టేటర్లు అక్రమంగా నిర్మిస్తున్న వాటిలో పంచ గ్రామాల భూములు, అక్కడక్కడా దేవుడి మాన్యాలు, గ్రామ కంఠ స్థలాలు కూడా ఉన్నాయి. ఏవి పంచ గ్రామాల భూములో? ఎక్కడ గ్రామ కంఠాలు ఉన్నాయో? సామాన్యులకు అర్థం కాని అమోమయ పరిస్థితిని రియల్టర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. గతంలో ఎప్పుడో ల్యాండ్‌ రెగ్యుల రైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) పేరిట ఏదో ఒక స్థలానికి తీసుకున్న డాక్యుమెంట్లను చూపించి అనుమతులు తెస్తున్నట్లు సమాచారం. పంచ గ్రామాల బాధితులకు ఏది సక్రమమో? ఏది అక్రమమో? తెలియక అక్రమ నిర్మా ణాలను ప్రశ్నించలేకపోతున్నారు. దీన్ని కొందరు అధికా రులు తమకు అనుకూలంగా మర్చుకొని అందిన కాడికి దోచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయిమాన్యం భూములు, గ్రామ కంఠాలను కొనుగోలు చేస్తున్న రియల్టర్లు ఆ పక్కనే ఉన్న పంచ గ్రామాల్లోని దేవస్థానం భూములుగా చెబుతున్న వాటిల్లోనూ నిర్మాణాలు చేస్తున్నారు. దేవస్థానం అధికారులు అడ్డుకోకుండా వీరు మేనేజ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గోశాల వద్ద కె కన్వెన్షన్స్‌ కల్యాణ మండపాన్ని ముందు భారీగా నిర్మించారు. అందులో కొంతభాగాన్ని దేవస్థానం అధికారులు అడ్డుకున్నారు. అదే గోశాలకు రెండో వైపున బిఆర్‌టిఎస్‌ రోడ్డు పక్కన సుమారు రెండు వేల గజాల స్థలాన్ని కొండను తొలిచి చదును చేస్తున్నా చోద్యం చేస్తున్నారు.

Related Posts