YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రంగంలోకి గవర్నర్ ఆఫీసు

రంగంలోకి గవర్నర్ ఆఫీసు

రంగంలోకి గవర్నర్ ఆఫీసు
విజయవాడ, ఫిబ్రవరి 20,
శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకునేలా ఉంది. గవర్నర్ నేరుగా రంగంలోకి దిగడంతో శాసనమండలి కార్యదర్శి పై వేటు తప్పదన్న సంకేతాలు కన్పిస్తున్నాయి. శాసనమండలి వ్యవహారం రాజ్ భవన్ కు చేరింది. శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలసి శాసనమండలిలో జరిగిన పరిణామాలను వివరించిన సంగతి తెలిసిందే. శాసనమండలి కార్యదర్శిపై గవర్నర్ కు షరీఫ్ ఫిర్యాదు చేశారు.తాను రూలింగ్ ఇచ్చినా రెండుసార్లు సెలెక్ట్ కమిటీ విషయాన్ని వెనక్కు పంపడాన్ని షరీఫ్ తప్పుపడుతున్నారు. శాసనమండలి కార్యదర్శి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని షరీఫ్ ఆరోపిస్తున్నారు. దీంతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శాసనమండలి కార్యదర్శిని నివేదికను కోరినట్లు తెలిసింది. దీనిపై ఆయన వివరణను రాజ్ భవన్ కోరడంతో కార్యదర్శిపై గవర్నర్ చర్యలు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.శాసనమండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు స్థానంలో విజయరాజుకు ఆ బాధ్యతలను అప్పగించాలని కూడా షరీఫ్ గవర్నర్ ను కోరినట్లు తెలిసింది. ప్రస్తుతమున్న బాలకృష్ణమాచార్యులను సస్పెండ్ చేయాలని కూడా గవర్నర్ ను షరీఫ్ కోరారు. చట్టసభలు గవర్నర్ పర్యవేక్షణలోనే పనిచేస్తాయి కాబట్టి ఆయన దృష్టికి మొత్తం వ్యవహారాన్ని షరీఫ్ తీసుకెళ్లారు. కొత్త సెక్రటరీని కూడా గవర్నర్ నియమించాల్సి ఉండటంతో ఆయననే ఆశ్రయించారు శాసనమండలి ఛైర్మన్ షరీఫ్.అయితే దీనిపై గవర్నర్ కార్యాలయం శాసనమండలి కార్యదర్శి వివరణ కోరినట్లు సమాచారం. పార్లమెంటరీ సంప్రదాయాలు ఎలా ఉన్నాయి? ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగాయా? అన్న విషయాలపై తన కార్యాలయ సిబ్బందిని గవర్నర్ పురమాయించారు. షరీఫ్ ఫిర్యాదు పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారంటున్నారు. శాసనమండలికి సంబంధించిన రికార్డులన్నింటినీ గవర్నర్ పరిశీలిస్తున్నారు. రూల్స్ బుక్ ఏం చెబుతుందో తెలుసుకుని దాని ప్రకారం చర్యలు ఉండవచ్చని టీడీపీ సయితం అభిప్రాయపడుతుంది. శాసనమండలి కార్యదర్శిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
రంగంలోకి ఉద్యోగ సంఘాలు
శాసనమండలి చైర్మన్, కార్యదర్శికి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‌లోకి ఉద్యోగ సంఘాలు ఎంటరయ్యాయి. అదేదో ఇద్దరి మధ్య సమరం అన్నట్లుగా.. మండలి చైర్మన్ పై మండి పడుతూ… సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు తెర ముందుకు వచ్చారు. చీఫ్ సెక్రటరీని కలిసి బయటకు వచ్చి రాజకీయ ప్రకటనలు చేశారు. రూల్స్‌కు విరుద్దంగా వెళ్లమని ప్రతిపక్షం అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని .. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన మరింత ఘాటుగా .. తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రూల్స్ లేవు..తొక్కా లేదంటూ యనమల, బోండా ఉమను జైల్లో వేయమని హోంమంత్రి చెబితే ప్రతిపక్షం ఏమంటుందని.. అచ్చంగా వైసీపీ నాయకుడిగా ఓ స్టేట్మెంట్ పడేశారు. హోంమంత్రి చెప్పారని పోలీసులు వారిని జైల్లో పెడితే ప్రతిపక్షం సమర్థిస్తుందా అనే లాజిక్ కూడా.. ప్రయోగించారు. సచివాలయ ఉద్యోగ సంఘం నేత తీరు చూసి.. మీడియా కూడా ఆశ్చర్యపోయింది. ఎవరైనా ఉద్యోగికి అన్యాయం జరిగితే.. అప్పుడు మాట్లాడినా ఓ అర్థం ఉంటుంది. కానీ.. మండలి చైర్మన్.. మండలి కార్యదర్శి తన విధులను.. సరిగ్గా నిర్వహించడం లేదని రాజ్యాంగ వ్యతిరేకంగా… తన ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని.. ఫిర్యాదు చేసినందుకే… ఉద్యోగ సంఘాల పేరుతో.. వెంకట్రామిరెడ్డి రంగంలోకి దిగిపోయారు. ఇంత వరకూ వైసీపీ నేత కూడా మాట్లాడనట్లుగా మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లుగా అరెస్టులు చేయమని ఆదేశించడానికి హోంమంత్రికైనా… ఎవరికైనా అధికారం ఉండదని.. చివరికి ఆ ఉద్యోగులు కూడా… నిబంధనల ప్రకారమే పని చేయాలన్న విషయాన్ని ఉద్యోగ సంఘం నేతలు మర్చిపోయారు. పాలక పార్టీ చల్లని చూపు కోసం.. ఉద్యోగ సంఘాల నేతలు పాకులాడటంలో.. రాజకీయ పార్టీలపైనా విమర్శలకు దిగుతూండటం.. కొత్త పరిణామంగా కనిపిస్తోంది.

Related Posts