YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిర్పూర్ నియోజకవర్గంలో డిజిటల్ టివిల పంపిణీ కార్యక్రమం

 చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిర్పూర్ నియోజకవర్గంలో డిజిటల్ టివిల పంపిణీ కార్యక్రమం

 చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిర్పూర్ నియోజకవర్గంలో డిజిటల్ టివిల పంపిణీ కార్యక్రమం
సిర్పూర్, ఫిబ్రవరి 19  
సిర్పూర్ నియోజకవర్గంలో విద్యావ్యవస్థలో అభివృద్దే ధ్యేయంగా చేతన ఫౌండేషన్ వారి సౌజన్యంతో డిజిటల్ టివిలను పంపిణీ చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జెడ్పీ చైర్మన్ కోవ లక్ష్మీ గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ గారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన కుమ్రభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో విద్యాభివృద్ది కోసం టివిలను పంపిణీ చేయడం నిజంగా ఇదర్శనీయమని పేర్కొన్నారు.. ఇటువంటి కార్యక్రమాన్ని జిల్లాలో కూడా చేయాలని ఆకాంక్షించారు..కోనేరు కోనప్ప గారితో కలిసి సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉంది-చేతన ఫౌండేషన్ ప్రతినిధి రవి గారుసిర్పూర్ నియోజకవర్గంలో కోనేరు కోనప్ప గారితో కలిసి సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉందని చేతన ఫౌండేషన్ ప్రతినిధి వెనిగళ్ళ రవి గారు పేర్కొన్నారు...నియోజకవర్గంలో అనునిత్యం ప్రజాసేవలో ఉండే కోనేరు కోనప్ప గారు రాజకీయనాయకుడు కాదని ప్రజాసేవకుడని పేర్కోన్నారు..మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు డిజిటల్ విద్యలో విద్యను అందించేందుకు సులభంగా పాఠాలను అర్థమయ్యేందుకు వీలుగా విద్యలో అభివృద్ధి చేసేందుకే ఈ డిజిటల్ టివిలను అందజేస్తున్నట్లు తెలిపారు..తంలో కూడా నియోజకవర్గంలో డిజిటల్ టివిలను అందజేశామని ఈ దఫా సుమారు 50 పాఠశాలలకు టివిలను అందజేస్తున్నట్లు తెలిపారు...చేతన ఫౌండేషన్ వారి సహకారం వెలకట్టలేనిది-ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సిర్పూర్ నియోజకవర్గంలో చేతన ఫౌండేషన్ వారు చేస్తున్న సేవలు సహకారం మరువలేనిది అని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు పేర్కొన్నారు..చేతన ఫౌండేషన్ వారు సిర్పూర్ నియోజకవర్గంలో గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని గతంలో పంపిణీ చేసిన కుట్టుమిషన్లు ఈనాటికి అవి పొందిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు..అధ్యాపకులు ఈ టివిలతో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణా రావు గారు కోనేరు ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్ చింతలమానేపల్లి ఎంపిపి డుబ్బుల నానయ్య జిల్లా డిఈఓ పలువురు ప్రజాప్రతినిధులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts