YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అవమానించిన డిప్యూటీ సీఎం... వైసీపీ కార్యకర్త ఆత్మహత్య

అవమానించిన డిప్యూటీ సీఎం... వైసీపీ కార్యకర్త ఆత్మహత్య

అవమానించిన డిప్యూటీ సీఎం... వైసీపీ కార్యకర్త ఆత్మహత్య
ఫిబ్రవరి 20,
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి చేదు అనుభవం ఎదురైంది. వేదిక మీదనే డిప్యూటీ సీఎంని ఓ వైసీపీ కార్యకర్త నిలదీశారు. తన తమ్ముడి చావుకి మీరే కారణమంటూ ప్రజలందరీ సమక్షంలో నిలదీయడంతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నోరుమెదపలేని పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ సీఎం అవమానించారని ఆయన గ్రామంలో ఉంటుండగానే వైసీపీ కార్యకర్త ఆత్మ హత్య చేసుకున్నారన్న వార్త చిత్తూరు జిల్లాలో రాజకీయ దుమారం రేపుతోంది. కార్వేటినగరం మండలంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పర్యటించారు. టీకే ఎం పేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ నిర్వహించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే ఆదిమూలంలు హాజరయ్యారు. ఈ గ్రామంలో చాలా కాలంగా భూపాల్ అనే నాయకుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి అనుచరుడిగా ఉండేవారు. అయితే అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో భూపాల్ కి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. వేదికపైకి కూడా రానివ్వలేదు. దీంతో భూపాల్ వెంటనే అవమాన భారంతో ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన సోదరుడు సభా వేదికపై ఉన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని నిలదీశారు. ఇప్పుడా సంఘటన కలకలం రేపుతోంది. గ్రామంలో సభ జరుగుతుండగానే భూపాల్ డిప్యూటీ సీఎం చేసిన అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని స్వయంగా భూపాల్ అన్నయ్య ఏళుమలై డిప్యూటీ సీఎంని ప్రజలందరి మధ్యలో నిలదీశాడు. పార్టీ కోసం కష్టపడిన వైసీపీ కార్యకర్తలకు అధికారంలోకి వచ్చాక ఆత్మహత్యల పాలు చేస్తారా అంటూ కన్నీరు మున్నీరై నిలదీయడంతో వైసీపీ క్యాడర్ అంతా నిశ్చేష్టులయ్యారు. ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త అన్నయ్య నిలదీసే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వేదికమీదున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నీళ్లు నమిలారు.

Related Posts