అంది వచ్చిన మార్పులకు అనుగుణంగా మాల్స్ మాయమైన ప్రస్తుత పరిస్థితులలో కోడిపుంజులను సైతం ప్రత్యేకమైన మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. వాస్తవానికి సంక్రాంతి అనగానే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కోడిపందాలు గుర్తువస్తాయి.
ఈ పందాలకి ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అడ్డాగా ఖ్యాతి చెందాయి. తెలుగు వారు అతి పెద్ద పండుగగా భావించి సంబరం గా జరుపుకొనే సంక్రాంతి 14, 15, 16 తేదీలలో అంగరంగ వైభవం గా నిర్వహించేందుకు సర్వ సన్నద్ధమవుతున్నారు.
ఈ క్రమం లో కోడిపందాలు సొమ్ము చేసుకొనేందుకు కొన్ని వ్యాపార సంస్థలు మాల్స్ తరహాలో కోడిపుంజులను అమ్మెందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరం కేంద్రం గా ఖ్యాతి చెందాయి.