YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ప్రిన్సిపాల్‌పై కాల్పులు

ప్రిన్సిపాల్‌పై కాల్పులు

నిందితుడిని రెండు వారాల క్రితం స్కూలు నుంచి సస్పెండ్ చేశారు..

ప్రిన్సిపాల్‌ను కలుస్తానని వెళ్లి..

ఓ విద్యార్థి తాను చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్‌పై కాల్పులు జరిపి, హత్య చేశాడు. శనివారం జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కలవరపరుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 12వ తరగతి చదువుతున్న విద్యార్థి తనను ప్రిన్సిపాల్ రితు చాబ్రా దూషించినందుకు తీవ్ర ఆగ్రహంతో ఆమెపై కాల్పులు జరిపాడు. తన తండ్రికి ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ఈ దారుణానికి పాల్పడ్డాడు. హర్యానాలోని యమునా నగర్‌లో ఈ ఘోరం జరిగింది. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ రాజేశ్ కాలియా చెప్పారు. వివేకానంద స్కూలు ప్రిన్సిపాల్ రితు చాబ్రాకు మూడు తూటాలు తగిలినట్లు తెలిపారు. ఆమెను ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తూ ఉండగా ఆమె మరణించారని పేర్కొన్నారు. నిందితుడి తండ్రి స్థిరాస్తి వ్యాపారి అని, ఆయనపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు.

పాఠశాల వర్గాల కథనం ప్రకారం నిందితుడిని రెండు వారాల క్రితం స్కూలు నుంచి సస్పెండ్ చేశారు. ఆ బాలుడు పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోవడంతోపాటు చిల్లర ఘర్షణలకు దిగుతుండటంతో ఈ చర్య తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ బాలుడు రివాల్వర్‌తో స్కూలుకు వచ్చాడు. ప్రిన్సిపాల్‌ను కలుస్తానని చెప్పాడు. ఆ తర్వాత నేరుగా ప్రిన్సిపాల్ చాబ్రా గదిలోకి వెళ్ళి, ఆమెపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దాలకు ఉలిక్కిపడిన సిబ్బంది కాస్త తేరుకుని ఆ బాలుడిని పట్టుకున్నారు.

Related Posts