YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

26 నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

26 నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

26 నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 20,
ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత వెల్లడించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఈవో గీత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మార్చి 3న ఎదుర్కోలు, 4న కల్యాణం, 5న రథోత్సవం ఉంటుందని ఆమె తెలిపారు. మార్చి 7న అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని చెప్పారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని, గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, సీఎం కేసీఆర్‌, మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో గీత పేర్కొన్నారు.

Related Posts