YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

.అక్బర్ హుస్సేన్ పై కరీంనగర్ ఎంఐఎం నేతలు ఫైర్ 

.అక్బర్ హుస్సేన్ పై కరీంనగర్ ఎంఐఎం నేతలు ఫైర్ 

.అక్బర్ హుస్సేన్ పై కరీంనగర్ ఎంఐఎం నేతలు ఫైర్ -ముందు సీఎం కేసీఆర్, మంత్రి గంగులకు క్షమాపణలు చెప్పాలి
-ఆరోపణలు నిరూపించకుంటే టిఆర్ఎస్ నుంచి వైదొలగాలి -మజీద్ ఇమామ్ కు అవార్డు ఇప్పించి డబ్బులు గుంజిన నీచ చరిత్ర నీది
ఫిబ్రవరి 20, 
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ పత్రికలలో చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్దమేనా.. సిద్దంగా ఉంటే
తేదీ నిర్ణయించి.. వేదిక ఖరారు చేయాలని ఎంఐఎం నేతలు సవాల్ విసిరారు. బుధవారం కరీంనగర్ పట్టణంలోని దారుస్సలాం కార్యాలయంలో ఎంఐఎం నేతలు విలేకరులతో మాట్లాడారు . అక్బర్ హుస్సేన్ టీఆరెస్ పార్టీకి తీరని ద్రోహం చేశాడని, చేసిన ద్రోహలకు ముందుగా సీఎం కేసీఆర్, మంత్రి గంగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికు పరోక్షంగా మద్దతునిచ్చి, గంగుల, టీఆరెస్ కార్పొరేటర్లు గెలవడం లేదని ప్రచారం చేసిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. కరీంనగర్ లోని పురాతన జామే మస్జిద్ ఇమామ్ కు ఉత్తమ ఇమామ్ అవార్డు ఇప్పించి సదరు ఇమామ్ వద్ద నుండి డబ్బులు తీసుకున్న నీచబుద్ది నీది అని ఆరోపించారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో
నీ అనుచరులకు ఉద్యోగాలు ఇప్పించి, సబ్సిడీ లోన్సు, కార్ల లోన్సు ఇప్పించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన మాట టీఆరెస్, మైనార్టీలందరికీ అనవు అణువు తెలుసన్నారు.  ఏంఐఏం కరీంనగర్ టౌన్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పై చేసిన అసత్య వాక్యాలను దమ్ము, ధైర్యం, చీము, నెత్తురు ఉంటే నిరూపించాలని వేదిక, తేదీ కోసం తాము ఎల్లవేళల సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.లేని యెడల పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. టిఆర్ఎస్ పార్టీ తో స్నేహ పూర్వక ఒప్పందం లో భాగంగా 25 డివిజన్ లలో పోటీకి బదులు 10 డివిజన్ లలో మాత్రమే పోటీ చేశామని అన్నారు. మొత్తం 25 స్థానాల్లో పోటీచేస్తే తమకు 15 స్థానాలు వచ్చేవని , పై స్థానాల్లో పోటీచేయక పోవడంతో ఎంఐఎం క్యాడర్ నారాజ్ అయిందన్నారు.తమ అధినేత బారిస్టర్ ఆసద్దుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు 10 స్థానాల్లో పోటీచేసి 6స్థానాలు,ఒక రెబెల్ తో కలిపి 7స్థానాల్లోగెలిచామన్నారు. ఒకవేళ అధినేత ఒవైసి 25 స్థానాల్లో పోటీచేయాలని ఆదేశిస్తే దాదాపు 15 సీట్లు గెలిచి డిప్యూటీ మేయర్ కైవసం చేసుకునే అవకాశం ఉండేదని అన్నారు. తమ పార్టీ హైకమాండ్ ఆదేశాలు పాటించి టీఆరెస్ పార్టీతో కలిసి స్నేహపూర్వక ఒప్పందం కారణంగా ఎంఐఎం త్యాగం చేసిందన్నారు. టీఆరెస్ విజయంపై తమకు సంతోషంగా ఉందని,అధినేత ఒవైసి సంకల్పం సైతం నెరవేరిందన్నారు. అక్బర్ హుస్సేన్ తన మూడేళ్ళ పదవీ కాలంలో మైనార్టీలకు పార్టీ పరంగా, ప్రభుత్వ పథకాల అమలు పరంగా క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ఎప్పుడైనా అవగాహన సదస్సులు, పార్టీ మీటింగ్ లు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ఓటమికి అక్బర్ హుస్సేన్ కూడా ఒక కారణమని, ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ఎంపి వినోద్ కుమార్, ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ ఎంఐఎం పార్టీ నేతల సేవలు తీసుకున్నారని, కానీ ఎంపీ ఎన్నికల్లో ఎంఐఎం సేవలు వద్దని ఎన్నికల ఇంచార్జి మంత్రి ఈటెల రాజేందర్,వినోద్ కుమార్ వద్ద అక్బర్ హుస్సేన్ వాదించి ఓటమికి కారకూడయ్యాడని వివరించారు . టిఆర్ఎస్ లో మైనార్టీ సెల్ లేదని చెప్పే ఉద్దేశ్యం కాదని ఏఒక్క మైనార్టీ టీఆరెస్ నుంచి గెలువలేదని టిఆర్ఎస్ కు మద్దతు గా ఉన్న ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం నుంచి 7గురు కార్పొరేటర్లు ఉన్నారని అందరం కలిసి కట్టుగా పనిచేసి 25 డివిజన్ లను అభివృద్ధి చేసుకుందామని చెప్పననీ అన్నారు. వాస్తవాన్ని వక్రీకరించి, తనపై వచ్చిన ఆరోపణలను డైవర్ట్ చేయడానికి ఇద్దరు అనుచరులతో అబద్ధాలు మాట్లాడిస్తున్నడని హేద్దేవ చేశారు .

Related Posts