శివరాత్రికి ముస్తాబైన సిద్ది రామేశ్వర ఆలయం
ఫిబ్రవరి 20
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రం శివారులో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణకాశీగా పిలవబడే శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నుంచి శనివారం వరకు ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా సిద్ధ రామేశ్వర ఆలయానికి శివ మాల ధరించిన శివ భక్తులు ఇరుముడి ధరించి శివ భక్తులు శివరాత్రి రోజు ఇరుముడిని స్వామికి సమర్పిస్తారు, శివరాత్రి సందర్భంగా ఆలయానికి భక్తులు ఈ జిల్లా నుండే కాక ఇతర జిల్లాల నుంచి మహారాష్ట్ర కర్ణాటక నుంచి వేల సంఖ్యలో భక్తులు స్వయంభులింగేశ్వరునీ దర్శించుకోవడానికి వస్తారు మూడు రోజులు ఇక్కడ ప్రత్యేక అర్చనలు పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు అలాగే ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సాంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలతోపాటు ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సందర్భంగా వచ్చే వేలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు కామారెడ్డి నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు అలాగే ఆలయ కమిటీ తో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసినట్టు కార్యనిర్వాహణాధికారి సి హెచ్ వెంకట్ నారాయణ తెలిపారు.