పారదర్శక పాలన కోసం కృష్ణా జిల్లా కలెక్టర్ 'లక్ష్మీకాంతం' చేపట్టిన డిజిటలైజేషన్ కార్యక్రమం అద్బుతమైన ఫలితాలను ఇస్తోంది. ప్రజలకు సంబంధించిన వివిధ సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను డిజిటలైజేషన్ చేయటంతో..ఆయా పథకాల ఫలాలు నేరుగా ప్రజలకు చేరిపోతున్నాయి. అర్హులైన వారు వాటి ప్రతిఫలాలను అనుభవిస్తూ...ప్రభుత్వంపై ప్రసంశలు కురిపిస్తున్నారు. అదే సమయంలో అనర్హులను అడ్డుకోవడంతో...జిల్లా వందల కోట్ల రూపాయలను ఆదా చేసుకోగలుగుతోంది. జిల్లా కలెక్టర్ 'లక్ష్మీకాంతం' చేపట్టిన పాలనాసంస్కరణలు, సాంకేతిక నైపుణ్యాన్ని ఒడుపుగా వాడుకోవడంతో...దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఆయన చేపట్టిన సంస్కరణలకు గుర్తింపు వస్తోంది. తాజాగా జిల్లా వ్యాప్తంగా అమలవుతున్న 'డిజిటలైజేషన్' కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వాషింగ్టన్ ఆసక్తి చూపుతోంది. జిల్లాలో డిజిటలైజేషన్ అమలును పరిశీలించేందుకు ఒక బృందం అమెరికా నుంచి జిల్లాకు వస్తున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ కృష్ణాపై వాషింగ్టన్‌లోని ఒక పత్రికలో ప్రచురించిన కథనం గేట్స్ ఫౌండేషన్ సీనియర్ అధికారిని ఆకట్టుకుందని..దీంతో వారు స్వయంగా డిజిటలైజేషన్‌ను అమలును పరిశీలించేందుకు ఏప్రిల్ నెలల్లో జిల్లాకు రానున్నారు.