YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఆధార్ పై విచారణకు బ్రేక్

ఆధార్ పై విచారణకు బ్రేక్

ఆధార్ పై విచారణకు బ్రేక్
హైద్రాబాద్, ఫిబ్రవరి 20
నకిలీ పత్రాలతో ఆధార్ కార్డులు పొందారనే అరోపణలపై యూఐడీఏఐ హైదరాబాద్‌లో 127 మందికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సరైన పత్రాలతో తమ పౌరసత్వం నిరూపించుకుంటే ఆధార్ కొనసాగుతుందని, లేదా దాన్ని రద్దు చేస్తామని అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి గురువారం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే, తాజాగా ఆ విచారణను రద్దు చేశారు. ఈ మేరకు యూఐడీఏఐ ఓ ప్రకటన విడుదల చేసింది.హైదరాబాద్‌లోని యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ విడుదల చేసిన ఆ ప్రకటనను బాలాపూర్‌లోని చంద్రాయణ్ గుట్ట రోడ్డులోగల మెగా గార్డెన్ ఫంక్షన్ హాలు ప్రహరీకి అంటించారు. ఈ ప్రకటన ప్రకారం.. ‘‘ప్రస్తుతం వీరి విచారణను రద్దు చేస్తు్న్నాం. తదుపరి చర్య ఎప్పుడనేది విచారణకు హాజరు కావాల్సిన వారికి ఇప్పటికే స్పీడ్ పోస్టులో వివరాలు పంపాం’’ అని పేర్కొన్నారు.హైదరాబాద్‌లో 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులివ్వడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డ సంగతి తెలిసిందే. ఈ 127 మంది జాబితాలో ముస్లింలు, దళితులు ఎంత మంది ఉన్నారని ప్రశ్నిస్తూ తెలంగాణ పోలీస్, ఆధార్ సంస్థను ట్యాగ్ చేస్తూ ఆయన బుధవారం ట్వీట్ చేశారు. దీనిపై తెలంగాణ డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పౌరసత్వాన్ని పరిశీలించే అధికారం ఆధార్ సంస్థకు లేదని గుర్తు చేశారు.

Related Posts