YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గుంటూరు జిల్లాల్లో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ  

గుంటూరు జిల్లాల్లో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ  

గుంటూరు జిల్లాల్లో
ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ  
గుంటూరు, ఫిబ్రవరి 20  
గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీలో విభేదాలు భగ్గమన్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని వర్గాలు కొట్లాటకు దిగాయి. ఎంపీ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌ ఇంటికి వెళ్లి.. అక్కడి నుంచి రాజశేఖర్‌ తనయుడు శ్రీనాథ్‌తో కలిసి పురుషోత్తమపట్నం బైరావారి ప్రభ దగ్గరకు వెళ్లారు. కొద్దిసేపు అక్కడే ఉండి.. తిరిరి బయల్దేరారు.ఎంపీ కారును ఎమ్మెల్యే రజినీ వర్గీయులు అడ్డుకున్నారు. తాము ఆహ్వానించినా ఎంపీ తమ ప్రభల దగ్గరకు రాలేదని మండిపడ్డారు. దేవరాయలు తమకు పార్టీకి సంబంధం లేని వారి ప్రభ వద్దకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కొందరు వైఎస్సార్‌సీపీ నేతలు ఎంపీ కారుపై చేతులతో కొట్టారు. పోలీసులు నేతల్ని అడ్డుకున్నా వినకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నవారిని పక్కకు తోసేశారు. ఎంపీ కాన్వాయ్‌ను అక్కడి నుంచి పంపించివేశారు. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.ఇదిలా ఉంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మర్రి రాజశేఖర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే రజినీ కొంతకాలంగా అసహనంతో ఉన్నారట. కొద్దిరోజులుగా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పెరిగాయని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. గతంలో ప్రోటోకాల్ విషయంలో కూడా ఇద్దరు నేతల మధ్య వివాదం తలెత్తగా తర్వాత సద్దుమణిగింది.చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్‌ సీనియర్ నేతగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత విడదల రజినీ ఎంట్రీతో సీన్ మారిపోయింది.. రాజశేఖర్‌ను బుజ్జగించి ఆమెను 2019 ఎన్నికల్లో సీటు కేటాయించగా.. ఆమె విజయం సాధించారు. రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. మండలి రద్దు కావడంతో రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. మరి చిలకలూరిపేట రాజకీయాలపై వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.

Related Posts