కృష్ణా జిల్లాల్లో చేపట్టిన డిజిటలైజేషన్ వల్ల జిల్లాకు వందల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి.గతంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల్లో దాదాపు 60శాతం మాత్రమే ప్రజలకు చేరేవి. మిగతా 40శాతం అక్రమార్కులు, లంచగొండుల జేబుల్లోకి వెళ్లేవి. అయితే ఇప్పుడు..డిజిటలైజేషన్ చేయటంతో దాదాపు 90శాతం ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తోన్న ఈపోస్, ఏఈఎఫ్‌డీఎస్, ఈ ఆఫీసు, ఈ సీడ్, ఈ క్రాప్, ఎల్‌సీసీఎం, ఈ విజిట్, భూదార్, ఈ కలెక్టర్ వంటి ఎన్నో కార్యక్రమాలను డిజిటలైజేషన్ చేశారు. దీంతో అనర్హులకు ప్రభుత్వ పథకాలు చేరకుండా అర్హులైన వారికే ఫలాలు వారి ఖాతాలోకి చేరిపోతున్నాయి. ఉదాహరణకు గతంలో రేషన్‌ను బోగస్ కార్డుల ద్వారా అక్రమార్కులు కొల్లగొట్టేవారు. దీని అరికట్టడానికి జిల్లా యంత్రాంగం ఈ పోస్‌ను తీసుకు వచ్చింది. దీని వల్ల లక్ష మంది రేషన్ కార్డు కలిగిన వారు..రేషన్ తీసుకోవడం లేదని తేలడంతో...జిల్లాకు దాదాపు రూ.100కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. అదే విధంగా రైతులకు ఎరువుల పంపిణీ (ఆధార్ ఎనేబుల్ ఫెర్టిలైజర్స్, డిస్ట్రిబ్యూషన్ స్కీమ్), 'లోన్ చార్జ్ క్రియేషన్ మాడ్యూల్, భూదార్,ఈ విజిట్, డ్రోన్‌ల వినియోగంతో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ...పాలనలో వినూత్నంగా ముందుకు దూసుకుపోతున్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ఇప్పటికే విజయవంతం అయ్యాయి. వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో..మిగితా జిల్లాల కలెక్టర్ల కన్నా...వేగంగా పనులు పూర్తి చేస్తుండడంతో...ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ప్రజాకలెక్టర్‌గా, సమర్థుడిగా..ఆయన పేరు తెచ్చుకుని పలువురి అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.