ఎస్సై ల్యాండ్ సెటిల్ మెంట్... సస్పెండ్
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 20
జోగులాంబ జిల్లాలో ఎస్సై సెటిల్మెంట్లకు పాల్పడుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భూతగాదం విషయంలో సెటిల్మెంట్ చేస్తున్న వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఎస్సై శ్రీనివాస్ వివాదాల్లో ఉన్న భూములను తన బంధువుల పేరిట అగ్రిమెంట్ చేయించుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. సెటిల్మెంట్లు చేస్తూ బాగా ముడుపులు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి.మీరే పెద్ద మనిషి అని బాధితులు ఎస్సైని వేడుకుంటుండడం వీడియోలో రికార్డయింది. మరోవైపు, మెదక్ రూరల్ ఎస్సై ఆంజనేయులు కూడా అక్రమాలకు పాల్పడి సస్పెండయ్యారు. గత కొద్దిరోజులుగా అక్రమ ఇసుక రవాణాకు తోడ్పడుతూ.. వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎస్సై ఆంజనేయులును జిల్లా ఎస్పీ చందన దీప్తి సస్పెండ్ చేశారు.