YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

లక్ష్మీనారాయణుడే క్షేత్ర పాలకుడు

లక్ష్మీనారాయణుడే క్షేత్ర పాలకుడు

లక్ష్మీనారాయణుడే క్షేత్ర పాలకుడు
పంచరామాలలో నాల్గోది ద్రాక్షారామము.త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా పంచారామాల్లో నాల్గోదిగా... దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. క్షేత్రంలో దక్ష ప్రజాపతి అనేక యజ్ఞాలు చేశాడని...అందుకే ఈ ప్రదేశాన్ని దక్షరామం అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామి భీమేశ్వరునిగా కొలువై ఉన్నాడు. ద్రాక్షారామంలో శివుడు భీమేశ్వరుడిగా స్వయంభువుగా వెలిసిన క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.భీమేశ్వర లింగం 15 అడుగుల ఎత్తు కంటే ఎక్కువగా ఉండి, సగం తెలుపు, సగం నలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండు అంతస్తులలో ఉంటుంది కనుక స్వామివారికి అభిషేకాదులు పై అంతస్తులో గల లింగ భాగానికి చేస్తారు. ఈ క్షేత్రం చాలా మహిమ కలదిగా చెబుతుంటారు. శ్రీ వేదవ్యాసుడే... లింగాన్ని ప్రతిష్టించారని చెబుతుంటారు. ఇక లక్ష్మీనారాయణుడే క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని నమ్మకం.తూర్పున కోలంక, పడమర వెంటూరు, 'దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో దంగేరు. నైరుతిలో కోరుమిల్లి'వాయువ్యంలో సోమేశ్వరం ఈశాన్యాన పెనుమళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు కనిపిస్తాయి. ఇక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది. తారకాసురుని మెడలోని శివ లింగాన్ని కుమారస్వామి ఛేదించగా  ఐదు చోట్ల పడ్డ ఆ లింగం ముక్కలను వివిధ దేవతలు ప్రతిష్ఠ చేశారు. స్థలానికి సంబంధించి మరో పురాణ కథ ప్రచారంలో ఉంది.దక్షప్రజాపతి నివసించినందుకే దాక్షారామం అయిందని...  అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ వుండేవి, అందుకని ద్రాక్షారామం పేరు వచ్చింది.దక్షుడు ఒక యజ్ఞం చేయ తలపెట్టాడు.  ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు కానీ, తన అల్లుడైన శివుణ్ణి  ఆహ్వానించకపోవడం.. పార్వతి దేవి ఒప్పించి  యజ్ఞానికి వెళ్లడం అవమానం భరించలేక  తనని తను కాల్చుకుని బూడిదైంది  ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు.  తన జటాజూటంనుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు.ఆయన వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు.  పత్నీ వియోగాన్ని భరించలేని శివుడు పార్వతి  సూక్ష్మ శరీరాన్ని భుజంమీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయ తాండవం చేశాడు.  శివుణ్ణి ఆపటానికి విష్ణువు పార్వతీ దేవి సూక్ష్మ శరీరాన్ని తన చక్రాయుధంతో ముక్కలు చేశాడు.  ఆ శరీరం 18 ముక్కలయి 18 చోట్ల పడ్డాయి.  అవే అష్టాదశ శక్తి పీఠాలు.  వీటిని జగద్గురువు శంకరాచార్యుల వారు పున  ప్రతిష్టించి అన్ని చోట్లా శ్రీ చక్రాలను కూడా స్ధాపించారు.  దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమరూపంలో స్వయంభువుడిగా వెలిశాడు.పూర్వం వేదవ్యాసుల వారు కాశీలో నివసించేవారు.  ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలచి  ఎక్కడా భిక్ష దొరక్కుండా చేశాడుట.  దానికి  వేదవ్యాసుడు కోపించి కాశీని శపించబోయాడుట.  అప్పుడ అన్నపూర్ణాదేవి ఆయనకీ, శిష్యులకీ భిక్ష పెట్టిందట.  వేదవ్యాసుడు కాశీని శపించబోవటం శివుడికి కోవం తెప్పించింది.  వెంటనే శివుడు వేదవ్యాసుణ్ణి శిష్యసమేతంగా కాశీ విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి  ఆయనకు దక్షారామము పోయి అక్కడ భీమేశ్వరుని  సేవించమనీ, అక్కడ వుంటే కాశీలో వున్నట్లే వుంటుందనీ...అందుకే ఇది దక్షిణ కాశిగా పిలుస్తుంటారు వ్యాసుడు తన 300 మంది శిష్యులను వెంటబెట్టుకుని దాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు.  దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంబంమీద వ్యాసుని విగ్రహం  కనిపిస్తుంటుంది.
ఇక్కడ వెలసిన భీమేశ్వరునికి అభిషేకం చేయటానికి  సప్త ఋషులు సప్తగోదావరులను తీసుకువచ్చారు. ఇవి అంతర్వాహినులు.దవ్యాసుడు, అగస్త్య మహర్షి ఒకే సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించారు.గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది.  అందుకే ఆ పేరు. గద లేదు.  నమస్కారముద్రలో  కనిపిస్తాడు క్రి.శ 892 నుండి 922 వరకు వేంగిరాజన్న పాలించిన తూర్పు చాళుక్య వంశానికి చేందిన చాళుక్య భీముడు ఈ భీమేశ్వరాలయాన్ని నిర్మించాడు..  నాలుగు వైపులా నాలుగు ఏత్తెన రాజగోపురాలతో సువిశాల ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఇచ్చట  ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి.  దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట. స్వామి వారికి అభిషేకం చేయడానికి గౌతమి నది దూరంగా ఉండటంతో సప్తఋషులు తమ తపోబలంతో గోదావరిని అంతర్వాహినిగా తీసుకు వచ్చి కోనేరులో వీలినం చేయడం వల్ల సప్త గోదావరి గా పేరోందింది. ఈపుష్కరినిలో స్నానమాచరించడం వల్ల గంగా నదిలో స్నానమాచరించినంత ఫలితం దక్కతుందని పురాణాలు పెర్కోన్నాయి. ఈసప్త గోదావరి లో పుణ్యస్నానమాచరిస్తే సప్త పాపాలు తోలగిపోతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం . 

Related Posts