ఐదవ పంచారామం కుమారభీమారామం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలే పంచారామాలు అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని అంటారు. పంచరామల్లో ఐదోవది భీమవరం కుమారభీమారామము. కుమారారామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉంది. ఇక్కడ బాలా త్రిపుర సుందరీదేవి సహిత సోమేశ్వరుడుగా దర్శనమిస్తాడు. ఈ స్వామిని కుమారస్వామి ప్రతిష్ఠించాడు. శ్రీదేవీ భూదేవీ సమేత జనార్దునుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. ఆలయంలో కాలభైరవుడు, చంద్రమౌళీశ్వరుడు, ఉమాసమేత మృత్యుంజయ లింగం,నవగ్రహాల గుడి ఉన్నాయి. ఈ ఆలయంలో శివరాత్రి పర్వదినాన ఉత్సవాలు మిన్నంటుతాయి. ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముడే ఈ ఆలయాన్ని నిర్మాణం చేశాడు.క్రీ.శ 892 నుంచి 922 వరకూ పాలించిన తూర్పుచాళుక్యులు సామర్లకోటలో కుమారారామ భీమేశ్వరాలయాన్ని నిర్మించారు. ఇందులో సుద్దరాయితో తయారైన లింగం కింది అంతస్తు నుంచి రెండో అంతస్తు వరకూ ఉంటుంది ఇక్కడి శివలింగం సున్నపురాయితో చేయబడింది.సామర్లకోటలోని భీమేశ్వర ఆలయం వాస్తు పరంగా ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయాన్ని చుట్టూ చెక్కిన ఇనుప రాతి తో కట్టిన రెండు ప్రాకారాలు ఉన్నాయి. బయట ప్రాకారానికి నాలుగు దిక్కులు నందు నాలుగు గోపుర ద్వారాలు ఉన్నాయి. ఈ గోపుర ద్వారానికి ఇరువైపులా అద్దమండపాలు ఉన్నాయి. లోపల ప్రాకారం వెనుక గోడగా ఉపయెగించి గుడిచుట్టూ రెండు అంతస్ధుల మండపం నిర్మించారు. ఈ మండపం పై అంతస్దు చేరడానికి తూర్పుభాగంలో మెట్లు ఉన్నాయి. ఆలయ లోపలి మండపం క్రింది భాగాన దక్షిణం వైపు విఘ్నేశ్వరుడు ఆలయం, సూర్యదేవాలయం, తూర్పు వైపున గిరిజ సుందరి ఆలయం ఉంది. లోపలి ప్రాకారం మధ్యలో ఉన్న భీమేశ్వరుడి దేవాలయంలో చతుస్రాకారంగా ఉండే రెండు అంతస్ధులుగా ఈ నిర్మాణం సాగింది. క్రింది అంతస్ధులో ప్రతిష్టించిన లింగము ఎత్తైనది కనుక ఇది కింద అంతస్ధు లోంచి వెళ్ళి రెండో అంతస్ధు ప్రవేశించి రుద్ర భాగంగా పూజింపబడుతుంది. స్వామి దర్శనం కోసం ప్రధాన ఆలయంపై అంతస్ధుకి ఏర్పరచిన ద్వారాలను సూర్య ద్వారం, చంద్ర ద్వారంగా పిలుస్తుంటారు. ఈ రెండు ద్వారాలు గర్భ గుడికి రెండు నాశిక రంధ్రాలుగా అనిపిస్తుంటాయి. ఇక్కడ స్వామికి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటూ తరచూ వేద మంత్రాల మధ్య నిత్య ఆరాధనలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. స్వామి వారి సతీమణిని ఇచట బాలా త్రిపుర సుందరిగా పిలుస్తుంటారు. ఆలయం చుట్టూ ఉన్న మండపంలో మహాగణపతి, కుమారస్వామి, వీరభధ్రుడు, బ్రహ్మ, సరస్వతి, సూర్యనారాయణ స్వామి, మైహిషాసుర మర్ధిని ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు పడమర దిక్కున ఏకశిల స్తంభం ఉంది. దీనిని గొల్ల స్ధంభంగా పిలుస్తుంటారు.