'భీష్మ' వసూల్ రాజా
రివ్యూ :P.V. రామ్ మోహన్ నాయుడు
నితిన్, రష్మిక భీష్మ చిత్రం వినోదాత్మకంగా ఉంది. కథ సాధారణమైనదే అయినప్పటికీ దర్శకుడు హాస్యం ప్రధానంగా కథను నడిపిన విధానం బాగుంది. హాస్య సన్నివేశాలు, సంభాషణలు బాగా పండాయి. హీరో నితిన్, సంపత్ ల మధ్య చాటింగ్ సన్నివేశం ప్రేక్షకులను గిలిగింతలు పెడుతోంది. మొదటి భాగం చక్కగా సాగింది అయితే రెండో సగంలో కథ కొంచెం పట్టు సడలింది. ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్లు ఊహించిన దానికన్నా గొప్పగా ఉన్నాయి. సినిమా కూడా నిరాశ పరచడం లేదు కనుక రానున్న రోజుల్లో మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. శుచికరమైన హాస్య సన్నివేశాలు నడిపించడంలో తివిక్రమ్ తరువాత ఈ దర్శకుడు వెంకీ కుడుములనే చెప్పుకోవచ్చు. అయితే ఒక్క కామెడీ మీదే ఆధారపడితే సినిమా నడిపించడం కష్టం. అంతర్లీనంగా భావో ద్వేగాల పోహళింపు ఉండాలి. అప్పుడే మంచి కథ, మంచి అభినయాలు రక్తి కట్టేది. కొన్ని సన్నివేశాలు " అలా వైకుంఠపురంలో" సినిమాను తలపిస్తున్నాయి. అయినా నితిన్ విభిన్నంగా నటించాడు. రెండో సగం లో భావోద్వేగాలు పండించడానికి చాలా అవకాశం ఉంది కానీ హాస్యాన్నే దర్శకుడు నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ట్విస్ట్స్ అని దర్శకుడు నమ్ముకున్న సన్నివేశాలు కొన్ని పండలేదు. సంభాషణలు అన్ని బాగున్నాయి వాటిలో " తబలా ఎంత కాస్ట్లీ అయితే ఏమిటి, వాయించేవాడు వీక్ అయుతే? ". నేను విక్టిమ్ సర్- విట్నెస్ కాదు" " నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిది. కనిపిస్తుంది, కానీ పట్టుకోలేను." అక్కకి దిక్కు లేక అటుకులు తింటుంటే, చెల్లెలు వచ్చి చికెన్ బిరియాని అడిగిందంట" " ఐ.ఏ.ఎస్ అంటే, ఐయామ్ సింగిల్" బాగా పేలాయి. మహతి సాగర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. సింగిల్ పాట చాల బాగుంది. సామ జవర గమన పాట స్థాయిలో హిట్ అయ్యేట్లు ఉంది. వినగానే పట్టేస్తుంది. నితిన్, రష్మిక డాన్సుకు బాగున్నాయి. నితిన్ వాడిన దుస్తులు, గాగుల్స్ కుర్రకారును ఆకట్టుకుంటాయి. రష్మిక గ్లామర్ , అభినయం రెండూ పండించింది. ఫోటోగ్రఫీ కూడా బాగుంది. మన తెలుగువాడు ఏ మధ్య కాలం లో ఫొటోగ్రఫి చేయడం ఇదేనేమో. కూర్పు అర్థవంతంగా ఉంది. సినిమా వేగాన్ని కూర్పు పెంచింది.
ఫైట్స్ సూపర్.. మెరుపులు: నితిన్ నటన
కామెడీ (ముఖ్యంగా చాటింగ్ సన్నివేశం)
సింగల్ సాంగ్
ఫోటోగ్రఫీ
ఫైట్స్ & ఆర్ట్
మరకలు
భావోద్వేగాల కొరత
ఇరికించినట్లున్న ట్విస్టులు
మొత్తనికి సినిమా బాగుంది . వినోదాత్మకంగా సాగిపోతుంది.
రేటింగ్: 3.25