YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీహార్ లో లిట్టి చోఖా రాజకీయం

బీహార్ లో లిట్టి చోఖా రాజకీయం

బీహార్ లో లిట్టి చోఖా రాజకీయం
పాట్నా, ఫిబ్రవరి 22, 
దేశంలో వివిధ ప్రాంతాల్లో రకరకాల వంటలు తయారవుతుంటాయి. ఆయా ప్రాంతాల ప్రజలు వాటిని ఇష్టంతో తింటుంటారు. కొన్ని వంటకాలైతే దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా పేరు తెచ్చుకున్నాయి. బీహారీ వంటకాల్లో కనీసం ఒకటైనా ప్రతి భారతీయుడూ రుచి చూడాలని, ఇష్టంగా తినాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముచ్చటపడుతుంటారు. అది ఆయన కల కూడా. ఆయన కోరిక ప్రధాని నరేంద్రమోడీ ఆస్వాదనతో తీరింది. బుధవారంనాడు న్యూఢిల్లీలోని హునార్ హాత్‌లో ‘లిట్టీ చోఖా’ అనే బీహారీ వంటకాన్ని రుచి చూశారు. ఆయన ఆసక్తితో దాన్ని టేస్ట్ చేయడం రాజకీయంగా వేడి రగిలించింది.ఆ వార్త హెడ్‌లైన్స్‌లో ప్రత్యక్షమైంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు రాగా, అధికార ఎన్‌డిఏ నాయకుల నుంచి ప్రశంసలు కురిశాయి.ఢిల్లీలోని హునార్ హాత్‌లో నరేంద్రమోడీ లిట్టి చోఖాను రుచి చూడడం… ఆ తరుణంలోనే బీహారీ వంటకం ప్రతి భారతీయుడికీ అందే లా చూసి, బీహార్ రైతు ల ఆదాయాన్ని పెంచే లా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాధికారులు చర్చలు జరపడం అనుకోకుండా ఒకేసారి జరిగాయి’ అని బీహార్ డిప్యూటీ సిఎం, బిజెపి నాయకుడు సుశీల్‌కుమార్ మోడీ గురువారం ట్వీట్ చేశారు. సుశీల్ మోడీ ప్రకటనకు, 2010 డిసెంబర్‌లో నితీష్‌కుమార్ చేసిన వ్యాఖ్యకూ సంబంధం ఉంది. ‘ఈ దేశంలో ప్రతి వ్యక్తి లేదా కుటుంబం తీసుకునే ఆహార పదార్థాల్లో కనీసం ఒకటి అయినా బీహారీ వంటకం ఉండాలని నా కల’అని నితీష్ అప్పట్లో ఆశించారు. మాజీ సిఎం జితన్‌రామ్ మాంఝీ మాట్లాడుతూ ‘ఈ ఏడాదిలో జరగాల్సిన ఉన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఇలా పరోక్షంగా తెలుపుతున్నారా? అదే కనుక నిజమైతే, మోడీ ఆ బీహారీ వంటకాన్ని తినడంలో రాజకీయ సంకేతమూ ఉంది’ అన్నారు. అంతేకాదు, తనకూ లిట్టి చోఖా అంటే ఇష్టమే అన్నారు.ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ ప్రధానిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. అంతేకాదు, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌కు కూడా లిట్టీ చోఖా అంటే ఇష్టమే. 2017లో మహాఘట్‌బంధన్ నుంచి నితీష్ విడిపోయినప్పుడు లాలూ మాట్లాడుతూ ‘బీహార్ లిట్టీ చోఖా ఔర్ నితీష్ కా ధోకా’ (నమ్మకద్రోహం) అని వ్యాఖ్యానించారు. కాబట్టి ఈసారి బీహార్ ఎన్నికల రాజకీయాలకు ఈ వంటకం సెంటర్ పాయింట్ కావచ్చు.

Related Posts