YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 కళ్యాణ్ నిర్వేదం. వరుస దెబ్బలతో జనసేనాని కుదేల్

 కళ్యాణ్ నిర్వేదం. వరుస దెబ్బలతో జనసేనాని కుదేల్

 కళ్యాణ్ నిర్వేదం.
వరుస దెబ్బలతో జనసేనాని కుదేల్
హైద్రాబాద్, ఫిబ్రవరి 22
రాజకీయాల్లో ఒంటరితనం ఉండదు, ఎవరైనా స్వయంగా కోరి చేసుకుంటే తప్ప. ఎందుకంటే కోట్లాది మంది జన సమూహానికి నాయకత్వం వహించేవారికి తాము ఏకాకులం అన్న భావన ఎపుడూ కలుగకూడదు, కానీ జనసేనాని మాత్రం ఆ రకమైన భావాలతో మధనపడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆయన తాజాగా ఢిల్లీలో జరిగిన విధ్యార్ధులు, యువజనుల సదస్సులో మాట్లాడుతూ తన మనసులోని ఆలోచనలు కొన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ‌్ కొన్ని తన స్వీయ అనుభవాలను వారితో చెప్పుకున్నట్లుగా ఉంది. దానిలో భాగంగా రాజకీయాల్లోకి మానసికంగా మనం ఒంటరివారిగా మిగులుతామని అంటున్నారు.మన ఆలోచనలను ఎవరూ అర్ధం చేసుకోరు, మన చుట్టూ ఉన్న వారు కూడా కలసి నడిచేందుకు చాలా సందర్భాల్లో సంకోచిస్తారంటూ పవన్ కల్యాణ్ అచ్చం తన స్వీయ బాధనే వెళ్ళబోసుకున్నట్లైందని అంటున్నారు. పవన్ కల్యాణ్ పార్టీ ప్రస్తుత స్వరూపం, ఆయన పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడాన్ని బట్టి ఆయన ఇలా మాట్లాడుతున్నారనుకోవాలి. నిజమే పవన్ పార్టీ ఓడగానే తలా ఒకరూ పార్టీని వదిలేసి వెళ్తున్నారు. మరి ఈ బాధను ఇన్నాళ్ళూ దాచుకున్న పవన్ కల్యాణ‌్ విద్యార్ధులు, యువజనుల వేదిక మీద వాటిని ఒక్కసారిగా వెళ్ళగక్కారనుకోవాలి.మనం మంచి కోసం ప్రయత్నం చేసినపుడు కూడా మనిషి సాయం, మాట సాయం ఉండని కూడా పవన్ కల్యాణ‌్ వాపోతున్నారు. ఇపుడున్న రాజకీయాలు ఇలాగే ఉన్నాయని కూడా పవన్ ఒకింత బాధను వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయినా సరే ధృఢమైన సంకల్పం ఉంటే మాత్రం మనం వాటిని అధిగమించి ముందుకు సాగగలమని ఆయన చెప్పుకొచ్చారు. తనకు అలాంటి గట్టి సంకల్పం ఉందని పవన్ కల్యాణ్ చెప్పుకున్నారు, కానీ తన వెనక నడిచేందుకు ఎవరూ లేరన్న ఆవేదనను ఆయన ఈ విధంగా బయటకు చెప్పారా అన్న మాట వినవస్తోంది.ఓ విధంగా విద్యార్ధులను, యువతను సామాజిక సేవలోకి రమ్మని పిలుపు ఇచ్చిన సందర్భంలో పవన్ కల్యాణ్ నిర్వేదంతోనే మాట్లాడారని అంటున్నారు. ఆయన రాజకీయ జీవితం విఫల దశలో ఉండడంతో పవన్ అలా మాట్లాడి ఉంటారని అంటున్నారు. మొత్తానికి వరస ఎన్నికల్లో అపజయాలు పవన్ కల్యాణ్ కి ఇలాటి చేదు భావనలు కలిగించి ఉంటాయని అంటున్నారు. అయితే పవన్ రాజకీయ వైఫల్యాలకు ఇతరులు ఎంత కారణమో తెలియదు కానీ ఆయన కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుందని హిత వచనాలు కూడా మేధావుల నుంచి వస్తున్నాయి. మొత్తానికి యువతను రాజకీయాల్లోకి రమ్మంటూ పవన్ కల్యాణ‌్ ప్రోత్సహించారా, నిరాశ పరచారా? అన్నది మాత్రం ఎవరికీ అర్ధం కాకుండా ఉంది.

Related Posts