YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం విదేశీయం

 ఫస్ట్ టెస్ట్.. భారత్ 165 ఆలౌట్

 ఫస్ట్ టెస్ట్.. భారత్ 165 ఆలౌట్

 ఫస్ట్ టెస్ట్.. భారత్ 165 ఆలౌట్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22,
న్యూజిలాండ్ గడ్డపై టెస్టుల్లో భారత్ అంచనాల్ని అందుకోలేకపోతోంది. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో పేలవరీతిలో 165 పరుగులకే ఆలౌటైంది. టీమ్‌లో అజింక్య రహానె (46: 138 బంతుల్లో 5x4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జెమీషన్, టిమ్ సౌథీ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్‌కి ఒక వికెట్ దక్కింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ తత్తరపాటు కారణంగా రనౌటయ్యాడు.ఆటలో రెండో రోజైన శనివారం ఓవర్‌నైట్ స్కోరు 122/5తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా.. మొదటి సెషన్‌లోనే అదీ 43 పరుగుల వ్యవధిలోనే మిగిలిన ఐదు వికెట్లనీ చేజార్చుకుంది. ఆరంభంలోనే కళ్లుచెదిరే సిక్స్‌తో మంచి ఊపుమీద కనిపించిన రిషబ్ పంత్ (19: 53 బంతుల్లో 1x4, 1x6) ఆ తర్వాత కొద్దిసేపటికే అజింక్య రహానెతో సమన్వయలోపం కారణంగా రనౌటయ్యాడు. దీంతో.. 132 పరుగుల వద్దే భారత్ ఆరో వికెట్ చేజార్చుకుంది.రిషబ్ పంత్‌ ఔటైన తర్వాత భారత్ ఇన్నింగ్స్ మరింత తడబాటుకి గురైంది. పంత్ వెనుదిరిగిన అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన అశ్విన్ (0) గోల్డెన్‌డక్‌గా వెనుదిరగగా.. ఆ వెంటనే అజింక్య రహానె, ఇషాంత్ శర్మ (5), మహ్మద్ షమీ (21: 20 బంతుల్లో 3x4) ఔటైపోయారు. దీంతో.. 68.1 ఓవర్లలోనే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. శుక్రవారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా (16), మయాంక్ అగర్వాల్ (34), చతేశ్వర్ పుజారా (11), విరాట్ కోహ్లీ (2), హనుమ విహారి (7) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు

Related Posts