అమ్మఒడి పథకం డబ్బుని పాత లోన్ కింద జమ
కర్నూలు ఫిబ్రవరి 22
అమ్మఒడి ..ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్క పేద పిల్లవాడు కూడా ఉన్నవారి పిల్లలలానే ..కార్పొరేట్ స్థాయి విద్యని అభ్యసించాలని అలాగే ప్రభుత్వ స్కూల్స్ లో చదివే పిల్లలు తమ స్కూల్స్ బాగ్స్ డ్రెస్ లు - బుక్స్ కోసం అని ...సీఎం జగన్ ఈ పథకాన్ని తీసుకువచ్చారు. అధికారంలోకి రాకముందే జగన్ ..వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ..ప్రతి విద్యార్థి చదువుకోసం ప్రభుత్వం తరపున డైరెక్ట్ గా వారి తల్లి బ్యాంకు అకౌంట్ లోకి 15 వేల రూపాయలు వేస్తా అని చెప్పారు. ఇక గత ఎన్నికలలో అత్యధికమైన సీట్లతో ..అధికారంలోకి వచ్చిన తరువాత ..ఈ పథకాన్ని అమల్లోకి తీసుకోని వచ్చిన విషయం కూడా తెలిసిందే.2020 జనవరిలో ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులని అర్హులైన ప్రతి ఒక్కరికి ..వారి తల్లుల బ్యాంకు అకౌంట్స్ లో వేశారు. అయితే ఇదే సమయంలో అమ్మఒడి పథకం కింద వచ్చే డబ్బుని ..బ్యాంకు వారు ఏ ఋణం కింద జమ చేయకూడదు అంటూ బ్యాంకులకు కూడా సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. కానీ కొన్ని చోట్ల ఇదే తంతు జరుగుతోంది..అమ్మఒడి పథకం కింద వచ్చిన డబ్బుని తమ పాత లోన్ కోసం జమ చేసుకుంటున్నారు అని కొందరు చెప్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఆర్థికమంత్రి రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు లో జరిగింది. అసలేమైంది అంటే ..?ఆర్థికమంత్రి రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు జిల్లా డోన్ లో ఓ విద్యార్థిని జేజమ్మ ఖాతాలో వేసి న సొమ్మును ఆ బ్యాంకు అధికారులు తమ రుణం కింద జమ వేసుకున్నారు. డోన్లోని ఇందిరానగర్లో చిన్నపెంకుటింట్లో నాగలక్ష్మి నివాసం ఉంటున్నారు. ఆమె కొడుకు మల్లేష్ కోడలు రామాంజనమ్మకు రామేశ్వరి అనే కుమార్తె ఉంది. అయితే కొన్ని రోజులక్రితం తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో రామేశ్వరి.. నాయనమ్మ వద్ద ఉంటూ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. అమ్మఒడి కోసం నాయనమ్మ బ్యాంకు ఖాతా ఇచ్చింది. పట్టణంలోని ఎస్ బీఐ శాఖలో ఆమె ఖాతాలో అమ్మఒడి పథకం కింద వచ్చే రూ.15 వేలు జమయింది. దీనితో ఆ డబ్బుని తీసుకోవడానికి వెళ్లిన విద్యార్థి నాయనమ్మ కి బ్యాంకు అధికారులు షాక్ ఇచ్చారు. మీకు ఇప్పటికే బ్యాంకులో ముద్ర రుణం ఉందని దీనితో అమ్మఒడి పథకం కిందవచ్చిన డబ్బుని ఆ లోన్ కోసం జమ చేసుకున్తునట్టు తెలిపారు. అది మనవరాలి డబ్బు అని ముద్ర ఋణం కింద జమ చేసుకోకుండా ..ఇవ్వాలంటూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా కనికరం చూపడం లేదు. సీఎం జగన్ అమ్మఒడి కింద తల్లులకిచ్చే డబ్బును బ్యాంకులు తమ అప్పుల కింద జమ కట్టకండి అని చెప్పినప్పటికీ కొందరు బ్యాంకు అధికారులు ఇలా చేస్తుండటంతో ఈ విషయంలో ప్రభుత్వం ఏ విదంగా స్పందిస్తుందో చూడాలి...