YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు

 ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు
విజయనగరం ఫిబ్రవరి 22,
ఈనెల 24 న విజయనగరంలో సిఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో... శనివారం ఉదయం అధికారులంతా విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోని హెలిపేడ్, దిశ పోలీస్ స్టేషన్, అయ్యోధ్య మైదానాలలో భద్రతాపరమైన తనిఖీలను చేపట్టారు. ఏవిషయన్ వింగ్, ఇంటిలిజెన్స్ వింగ్, జిల్లా పోలీసు శాఖలు కలిసి అడుగడుగునా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, ఇతర అధికారులు పాల్గన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పర్యటనకి 1500 మంది పోలీసులతో బందోబస్తును నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 24 న ఉదయం 11 గంటలకి విశాఖపట్నం నుండి హెలికాప్టర్ లో సిఎం జగన్మోహన్ రెడ్డి విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపేడ్ లో దిగి.. సభ స్థలి అయిన అయోధ్య మైదానానికి వెళ్తారని తెలిపారు. 12.35 గంటలకి సభను ముగించుకొని సిఎం దిశ పోలీస్ స్టేషన్ ని ప్రారంభిస్తారని చెప్పారు. ఒంటి గంటకి మళ్ళీ హెలిపేడ్ నుండి విశాఖపట్నానికి తిరుగు ప్రయాణమవుతారని చెప్పారు. సిఎం జగన్ పర్యటన నేపథ్యంలో... పట్టణంలోని నాలుగు చోట్ల ఎఎస్పి ర్యాంక్ ఆఫీసర్ తో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని చోట్లా సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంనికి డిజిపి గౌతమ్ సవాంగ్, హోం మంత్రి సుచరిత, మంత్రులు వనిత, తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు

Related Posts