YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 104 కు చికిత్స అవసరం

 104 కు చికిత్స అవసరం

 104 కు చికిత్స అవసరం
విజయనగరం, ఫిబ్రవరి 22, 
సంచార చికిత్సకు సుస్తీ చేసింది. గ్రామీణ ప్రాంతంలోని గర్భిణులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు వైద్య సేవలందించే 104 వాహనాలు మరమ్మతులతో మూలకు చేరుతున్నాయి.విజయనగరం జిల్లాలో 19 వాహనాలకు 23 మంది వైద్యులకు కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు బిపి, సుగర్‌ వ్యాధులకు పరీక్షలు చేసిన 104 వాహనాలు ప్రస్తుతం మందుల సరఫరాతో సరిపెడుతున్నాయి. ఇలా రాష్ట్రంలో 300 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, కేవలం 140 మంది, 300 మంది నర్సులకు వంద మంది మాత్రమే ఉన్నారు. ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెన్నీషియన్ల పోస్టులు దాదాపుగా లేనట్లే. చిన్నచిన్న రిపేర్లను సైతం చేయకపోవడంతో సంచార వాహనాలన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే పరిమితమవుతున్నాయి. విజయనగరం జిల్లాలో 19 వాహనాలకు ఏడు, విశాఖలో 24 వాహనాలకు 18 మూలకుచేరాయి. ఇలా రాష్ట్రంలోని 298 వాహనాల్లో దాదాపుగా సగం వరకూ నిలిచిపోయినట్లు సమాచారం. వీటిలో అత్యధికంగా ఏజెన్సీ వాహనాలు కావడం గమనార్హం. మరోవైపున తిరుగుతున్న వాటిలోనే సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఫలితంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రోగులకు వైద్యసేవలందించే సంచార వైద్యం చతికిలపడుతోంది.సాలూరు మండలం పారన్నవలస గిరిజన గ్రామానికి ప్రతి నెలా సంచార వైద్యసేవలందించే 104 వాహనం నెల రోజులుగా రావడం లేదు దీంతో గ్రామంలోని గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే బిపి, షుగర్‌ రోగులకు మందులు అందకుండా పోయాయి. వాస్తవానికి వీరంతా ప్రభుత్వవైద్యం పొందడానికి భోగవలస పిహెచ్‌సికి వెళ్లాలి. బస్సు సౌకర్యం లేకపోవడంతో 25 కిలోమీటర్లు దూరం కాలినడకన వెళ్లాల్సిందే. ఈ మండలంలో వందకు పైగా గ్రామాలది ఇదే పరిస్థితి. ఇలా జిల్లాలో పార్వతీపురం, కురుపాం, గజపతినగరం, ఎస్‌.కోట 104 వాహనాలు నిలిచిపోవడంతో ఆయా ప్రాంత గిరిజనులకు వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. సాలూరు, కురుపాం సంతలకు తిరిగే వాహనాలు కూడా ఆగిపోవడంతో గిరిజన ప్రాంత ప్రజలు వైద్యానికి దూరమై, అష్టకష్టాలు పడుతున్నారు.విజయనగరం జిల్లాలో సంచార వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం 19 వాహనాలను నడిపేది. ఇవి నెలలో ఒక సారి గ్రామానికి వెళ్లి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే బిపి, సుగర్‌, ఆస్తమా, ఫిట్స్‌ వంటి వ్యాధి గ్రస్తులకు మందులు అందించాలి. బిపి, సుగర్‌ రోగులకైతే క్రమం తప్పకుండా మందులు పంపిణీ చేయాలి. అలాగే గర్భిణులకు ప్రతినెలా చికిత్స చేసి, ఆరోగ్య సూచనలు అందించాల్సి ఉంది. కానీ కొద్ది నెలలుగా గ్రామాలకు 104 వాహన సేవలకు వెళ్లకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారుగా ఏడు వాహనాలు మరమ్మత్తుల కారణంగా నిలిచిపోగా, తిరుగుతున్నవి కూడా నిత్యం డీజిల్‌ కొట్టించక, ఇంజినాయిల్‌ లేక, అరిగిన టైర్లు మార్చక పిహెచ్‌సిలకే పరిమితం అవుతున్నాయి. వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రయివేటు ఏజెన్సీ గడువు ముగిసింది. అప్పటి నుంచి డిఎంహెచ్‌ఒ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం వీటిని తిప్పుతోంది. వచ్చే ఏప్రిల్‌ నుంచి మండలానికొక కొత్త వాహనం ఇస్తామన్న వైసిపి ప్రభుత్వం ప్రస్తుతమున్న వాహనాలను పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పూర్తిగా వాహనాలు నిలిచిపోగా, కొన్ని చోట్ల సగానికి పైగా వాహనాలు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

Related Posts