YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

“ఆధార్” పౌరసత్వ పత్రం కాదు

“ఆధార్” పౌరసత్వ పత్రం కాదు

“ఆధార్” పౌరసత్వ పత్రం కాదు
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 20 
రాష్ట్ర పోలీసు విభాగం కొంత మంది నివాసితులను అక్రమ వలసదారులుగా అనుమానిస్తూ వారు ఆధార్ ను కూడా సరైన ధ్రువీకరణ పత్రాలతో లేకుండా పొందినట్లు ఫిర్యాదులు చేయడంతో, యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయము 127 మంది కి  విచారణ నోటీసులు జారీ చేసినది.  ఈ నేపథ్యం లో కొన్ని ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు సరైన దృష్టి కోణంలో లేవని మరియు ఆధార్ పౌరసత్వ ప్రమాణ పత్రం కాదని, UIDAI వివరణ ఇచ్చింది.  ఆధార్ చట్ట ప్రకారం ఆధార్ నమోదు చేసుకునే ముందు, ఒక వ్యక్తి భారతదేశం లో 182 రోజులు నివసించి ఉండాలన్న నిబంధనను, UIDAI తప్పనిసరిగా నిర్ధారించాలి. అలాగే, అక్రమ వలసదారులకు ఆధార్ జారీ చేయవద్దని భారత సుప్రీం కోర్టు తమ కీలక తీర్పు లో యుఐడిఎఐని ఆదేశించింది. 127 మంది ఆధార్ నంబర్ పొందటానికి అర్హత లేని అక్రమ వలసదారులు ఆధార్ ను కలిగి ఉన్నట్లు రాష్ట్ర పోలీసులు  తమ ప్రాధమిక  విచారణలో కనుగొన్నట్లు  ప్రాంతీయ కార్యాలయము హైదరాబాద్‌కు నివేదిక ఇచ్చిన విషయం గమనార్హం.  ఆ విధంగా పొందిన ఆధార్ లు రద్దు చేయబడతాయి కాబట్టి వారిని వారి ధ్రువీకరణ పత్రాలను తీసుకొని వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడమైనది. ఒక వేళ విచారణ లో ఎవరైనా నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా లేదా అక్రమ మార్గాల ద్వారా ఆధార్ ను పొందినట్లు నిరూపితమైతే, వారి ఆధార్ ను రద్దు చేయడం లేదా తాత్కాలికంగా  నిలిపి వేయడం జరుగుతుంది. పౌరసత్వంతో ఈ నోటీసులకు ఎటువంటి సంబంధం లేదు మరియు ఒక నివాసి యొక్క ఆధార్ సంఖ్యను రద్దు చేయడం అనేది ఆ వ్యక్తి జాతీయతతో ఎలాంటి సంబంధం లేదు. కొన్నిసార్లు,  ఒక నివాసి వేరొకరి బయోమెట్రిక్స్ లేదా సరైనవి కాని పత్రాలను సమర్పించడం ద్వారా ఆధార్ పొందినట్లు ద్రువీకరించబడితే ఆధార్ నంబర్ రద్దు చేయడం అనివార్యం. UIDAI తరచూ తమ సేవలను మెరుగు పరుచుటకు గాను ఇటువంటి ప్రక్రియను అవలంబిస్తుంది.
UIDAI చే జారీ చేయబడిన నోటీసులలో, హైదరాబాద్ నివాసితులు 127 మంది, వారి వ్యక్తిగత విచారణ కోసం ఫిబ్రవరి 20న డిప్యూటీ డైరెక్టర్ ముందు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. ఆధార్ పొందటానికి వారు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను సేకరించడానికి వారికి మరికొంత సమయం పట్టవచ్చు కాబట్టి రాష్ట్ర పోలీసు విభాగం సూచన మేరకు UIDAI వ్యక్తిగత విచారణను మే 2020 కి వాయిదా వేసింది.

Related Posts