YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆస్థుల ప్రకటనపై అనుమానాలు

ఆస్థుల ప్రకటనపై అనుమానాలు

ఆస్థుల ప్రకటనపై అనుమానాలు
తాడేపల్లి ఫిబ్రవరి 20 
లోకేశ్ హడావుడిగా ఆస్దులెందుకు ప్రకటించారు. హడావుడిగా ఆస్తుల ప్రకటన అనుమానాలకు తావిస్తోంది.  అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. ఆయన ప్రకటించిన ఆస్తులన్నీ డూప్లికేటే. చంద్రబాబు మాజి పిఎస్ ఇంట్లో సోదాలు చేస్తే 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ శ్రీ రంగనీతులు.చేసేవన్నీ తప్పుడు పనులు. చంద్రబాబు 100 తప్పులపై బిజేపి ఛార్జ్ షీట్ కూడా వేసింది. తవ్వేకొద్దీవేలకోట్ల అక్రమాలు బయటపడుతున్నాయి. ఐటి విచారణలో నిజాలు బయటపడుతున్నాయనే హడావుడిగా ఆస్తుల ప్రకటన. చంద్రబాబు పినామీ ఆస్దులు ప్రకటింపచేస్తే అతిపెద్ద దోపిడీదారుడుగా తెలుస్తుంది. అహ్మద్ పటేల్ కు ఐటి నోటీసులపై చంద్రబాబు నోరు విప్పాలి. కాంగ్రెస్ కు ఎంత కప్పంకట్టారో తెలుస్తుంది. రాష్ర్ట విభజనకు చంద్రబాబు సహకరించారని అనుమానాలు. హవాలాపై నిప్పునాయుడు ఎందుకు స్పందించలేదు. దోచుకున్న సొమ్మును మీ పరపతిని కాపాడేందుకు ఉపయోగించారు. దోపిడీ సొమ్మును స్వార్ధ ప్రయోజనాలకోసం ఉపయోగించారు. హవాలా మార్గంలో దోపిడీ సొమ్మును పప్పుబెల్లంలా పంచారు. చంద్రబాబు అవినీతిని ఆ దేవుడైనా కాపాడలేడు. అవినీతి హవాలా సామ్రాజ్యం బద్దలవుతోంది. భవిష్యత్తులో చంద్రబాబుకు తీహార్ జైలు తప్పదని హెచ్చరించారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఏ ఎన్నికలలో గెలవలేదు. ఐటి దాడులనుంచి దృష్టి మరల్చేందుకే ప్రజాచైతన్యయాత్ర. తన బినామిలను కాపాడేందుకే యాత్ర చేపట్టారు. అవినీతితో రాష్ర్టాన్ని చంద్రబాబు అధోగతి పాలు చేశారని అయన విమర్శించారు.

Related Posts