నందీశ్వరునిపై సోమస్కంధుడి రాజసం
పురవీధుల్లో నంది , సింహ , వాహనాలపై ఊరేగుతున్న ఆదిదంపతులు
అమ్మవారి వాహనసేవలో ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా డ్రమ్స్ శివమణి
శ్రీకాళహస్తి ఫిబ్రవరి 22 (
శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు నంది, సింహ, వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరస్వామి నంది, వాహనంపై, అమ్మవార్లు సింహ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. స్వామి, అమ్మవార్లకు అలంకార మండపంలో ప్రత్యేక పూజలు చేసి, విశేషాలంకరణ అనంతరం నంది సింహ వాహనంపై కొలువుదీర్చి శివగోపురం(దక్షిణద్వారం) మీదుగా వేంచేపు చేసి, పురువీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. వాహన సేవలో స్వామివారు నందీశ్వరుని ముందు నడస్తుండగా కోలాటాలు, భజనలు, శివ సంకీర్తనలు, మంగళవాయిద్యాల నడుమ అట్టహాసంగా వాయులింగేశ్వరుడు సతీసమేతంగా పురవీధుల్లో నందిసింహ వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. వారితోపాటు పంచమూర్తులైన స్వామివారి కుమారులు వినాయకుడు మూషిక వాహనంపై, కుమారస్వామి నెమలి వాహనంపై, పరమ భక్తుడు భక్తకన్నప్ప, చండికేశుడు, శ్రీకాళహస్తిలు (సాలిపురుగు, పాము, ఏనుగులు) కూడా పురవీధుల్లో ఊరేగారు. భక్తులు కర్పూరహారతులిచ్చి, మొక్కులు తీర్చుకున్నా రు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా డ్రమ్స్ మణి అమ్మవారి వాహనసేవలో పాల్గొన్నారు.