YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

కార్పొరేషన్ ప్రాజెక్టులకు స్థలాల కొరత

కార్పొరేషన్ ప్రాజెక్టులకు స్థలాల కొరత

కార్పొరేషన్ ప్రాజెక్టులకు స్థలాల కొరత
హైద్రాబాద్ర్, ఫిబ్రవరి 24,
జిహెచ్‌ఎంసి అధికారులు పనితీరులో మార్పు రావడం లేదు.  కొత్త ప్రాజెక్టులు ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగాల నిర్లక్ష్యం కారణంగా వెనకబడిపోతున్నాయి. ప్రతిష్టాత్మక  పథకాల అమల్లో పెద్దగా చెప్పుకోదగిన అభివృద్ధి ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే గాక, కార్పొరేషన్ ఆవిర్భవించిన నాటి నుంచే జిహెచ్‌ఎంసి నగరంలో ఏ ప్రాజెక్టును చేపట్టినా, స్థల సేకరణ అనేది ప్రధాన సమస్యగా మారింది. ఎలాగోలాగ స్థలసేకరణ పూర్తి చేసిన తర్వాత పనుల కేటాయింపులు, పనుల్లో నాణ్యత వంటివి అడ్డంకులు వరుసగా ఎదురుకావటంతో గడిచిన రెండు దశాబ్దాల్లో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పవచ్చు. ఇందుకు మూసీ ప్రక్షాళన, చార్మినార్ పాదచారుల క్షేత్రం వంటి ప్రాజెక్టులు ముఖ్యమైన ఉదాహరణలు. ఇక కనీసం టెండర్లకు కూడా నోచుకోని పనులెన్నో ఉన్నాయి. ఇందులో అప్పట్లో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సులుండగా, ఇపుడు ఆ ప్రాజెక్టు సరసన డబుల్ బెడ్ రూం స్కీం కూడా చేరింది. పాలకులు, సంబంధిత మంత్రులు ఆయా పథకాలకు సంబంధించిన పనులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులపై సమీక్షలు నిర్వహించకపోవటం, నిత్యం పర్యవేక్షించకపోవటం అధికారుల పాలిట వరంగా మారిందన్న చర్చ ఉంది. రాష్ట్రం ఏర్పడి సుమారు మూడేళ్లు గడుస్తున్నా, జిహెచ్‌ఎంసిలోని ఒక్క విభాగం పనితీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. ఎన్నో ఆశలతో, ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో ప్రజలకు లబ్ది చేకూర్చేందుకు, ట్రాఫిక్, ప్రజారవాణా వ్యవస్థ, వౌలిక వసతుల పరంగా మెరుగై సేవలందించేందుకు చేపట్టిన ఎస్‌ఆర్‌డిపి, ఆధునిక మార్కెట్లు, పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు డబుల్ బెడ్ రూం స్కీం వంటి పథకాలను ప్రారంభించినా ఆరంభంలోనే హంసపాదుగా మారుతోంది. సొంతిల్లు లేని పేదల కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం స్కీం ప్రస్తుతం ట్రబుల్స్‌ను ఎదుర్కొంటుంది. 2019 సంవత్సరం చివరికల్లా నగరంలో లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఈ స్కీం అమలు కేవలం ఐడిహెచ్‌కాలనీకే పరిమితమైందంటూ ఇప్పటికే విపక్షాలు విమర్శిస్తున్నాయి. అంతేగాక, ఈ స్కీంను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం యూనిట్ ధరను పెంచటంతో పాటు ఈ ఇళ్ల నిర్మాణ పనుల టెండర్లను కూడా మరింత సరళీకృతం చేసి, ఈ భవనాల నిర్మాణంలో పలు నహాయింపులనిచ్చినా, స్కీం ముందుకు సాగటం లేదు. ఇప్పటి వరకు 128  ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించేందుకు పలు సార్లు టెండర్లను ఆహ్వానించినా నిర్మాణదారులు ముందుకు రాకపోయినా, ప్రభుత్వం తాజాగా మరో 16 బస్తీల్లో ఈ ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే పలు మెయిన్‌రోడ్లు, జంక్షన్లలో ఎలాంటి ఆటంకాల్లేకుండా సిగ్నల్స్ లేకుండా ప్రయాణించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్డు  డెవలప్‌మెంట్ ప్లాన్ కింద చేపట్టిన పనులు ప్రభుత్వం, అధికారులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగటం లేదు. వీటిలో ముఖ్యంగా కెబిఆర్ పార్కు చుట్టు ఆరు జంక్షన్లు, ఎల్బీనగర్‌లో  నాలుగు జంక్షన్లు, ఉప్పల్ నుంచి రసూల్‌పురా మధ్యలో రెండు జంక్షన్లు, మైండ్ స్పేస్ టు జెఎన్‌టియు మధ్య నాలుగు జంక్షన్లతో మొత్తం 16 జంక్షన్ల అభివృద్ధికి అయిదు ప్యాకేజీలుగా  టెండర్లను చేపట్టారు. ఇందులో కెబిఆర్ పార్కు చుట్టు చేపట్టాల్సిన పనులకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు ఉంది. ప్రస్తుతం మైండ్ స్పేస్ నుంచి జెఎన్‌టియు వరకు అండర్ పాస్  పనులు కాస్త వేగంగానే జరుగుతున్నాయి.

Related Posts