YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 భారీగా పడిపోయిన లైఫ్ ట్యాక్స్

 భారీగా పడిపోయిన లైఫ్ ట్యాక్స్

 భారీగా పడిపోయిన లైఫ్ ట్యాక్స్
హైద్రాబాద్, ఫిబ్రవరి 24, 
ఆర్థిక మాంద్యం రవాణా శాఖ ఆదాయానికి పెద్దమొత్తంలోనే గండి కొట్టింది. రాష్ట్రంలో ఆ శాఖ ఏటా నిర్దేశించుకునే లక్ష్యం ఈసారి అందుకోవడం గగనమైపోయింది. వాహనాల కొనుగోళ్లు గణనీయంగా పడిపోవడం, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే లైఫ్‌ ట్యాక్స్‌ బాగా తగ్గిపోవడంతో అమ్మకాల్లోనూ భారీ క్షీణత కనిపిస్తున్నది. త్రైమాసిక పన్ను, ఫీజులు, సర్వీసు చార్జీలు, డిటెక్షన్ల పేరుతో వసూలయ్యే మొత్తాల్లోనూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగానే కనిపిస్తున్నది.గతేడాదితో పోలిస్తే ఈసారి హైదరాబాద్‌ పరిధిలో వాహనాల అమ్మకాలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌ రిజియన్‌లోనే గతేడాది అన్ని రకాల వాహనాలు 2,15,214 నమోదుకాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నాటికి 1,67,932గా నమోదైంది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో కొత్త వాహనాల అమ్మకాలపై ప్రభావం స్వల్పంగా ఉంది. ఏటా రవాణాశాఖ ఆదాయం 14 శాతం నుంచి 17శాతం వరకు వృద్ధి నమోదయ్యేది. కానీ, గడిచిన రెండేండ్లలో అంటే, 2018-19లో వృద్ధి రేటు 8.57 శాతం నమోదు కాగా, ఈ ఏడాది 3.02శాతానికే పరిమితమైంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావమే ఈ స్థితికి కారణమని స్వయంగా రవాణా మంత్రే వెల్లడించడం గమనార్హం. 'కొత్త టెక్నాలజీ వాహనాలు మార్కెట్‌లోకి వస్తున్నా అమ్మకాలు పడిపోయాయి. బీఎస్‌-6 వాహనాల కోసం కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31 దాటితే బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ కుదరదు. బీఎస్‌-6 వస్తేగానీ విక్రయాలు పెరిగే అవకాశమే లేదు' అని ఓ ఆటోమొబైల్‌ షోరూమ్‌ డీలర్‌ తెలిపారు.రవాణాశాఖ 2018-19లో రూ.3,950 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.3,504 కోట్లకు పరిమితమైంది. 2019-20లో రూ.3715 కోట్ల రాబడి లక్ష్యంగా పెట్టుకుంది. 2019 డిసెంబర్‌ వరకు రూ.2,700 కోట్ల ఆదాయం మాత్రమే ఆర్జించింది. ఈ లెక్కన మార్చి చివరి నాటికి రవాణాశాఖ సుమారు వెయ్యి కోట్ల ఆదాయాన్ని  రాబట్టుకోవాల్సి ఉంది. గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ పరిస్థితి అలాగే ఉంది. మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలు అటీటుగా ఉన్నా.. హైదరాబాద్‌ జిల్లా ఆదాయం మాత్రం పడిపోయింది. మార్కెట్‌ పరిస్థితుల దృష్ట్యా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం రానున్న బడ్జెట్‌ కేటాయింపుల్లో కచ్చితంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రవాణాశాఖకు భారీగా కోత పెట్టే అవకాశమూ లేకపోలేదని అంచనా.

Related Posts