YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖపై జగన్ వెనక్కి తగ్గరా...

విశాఖపై జగన్ వెనక్కి తగ్గరా...

విశాఖపై జగన్ వెనక్కి తగ్గరా...
విశాఖపట్టణం, ఫిబ్రవరి 24
జగన్కు నేవీ అధికారులు షాకిచ్చారు.. మిలీనియం టవర్స్‌లోకి ఎంట్రీ లేదా. అవునంటున్నారు టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై నేవీ అధికారులు అభ్యంతరం తెలిపారని.. ఆ కారణంతోనే సీఎం జగన్ వెనక్కి తగ్గారన్నారు. మిలీనియం టవర్స్‌లో రాజధాని ఏర్పాటు చేయొద్దని నేవీ అధికారులు ప్రభుత్వానికి చెప్పారని.. ఈ విషయాన్ని మీడియా కూడా స్పష్టం చేసిందన్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తామని హడావిడి చేసినవాళ్లు ఇప్పుడు ఏం చెబుతారన్నారు.మిలీనియం టవర్స్‌లో ఏపీ ప్రభుత్వానికి నేవీ అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఆసక్తికరమైన కారణాన్ని చెప్పుకొచ్చారు బొండా ఉమా. సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలనుకుంటున్న మిలీనియం టవర్స్‌కు సమీపంలో.. దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగ ఉండటమే కారణమంటున్నారు. దేశ రక్షణకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగ ఐఎన్ఎస్ సుమారు 734 ఎకరాల మేర విస్తరించి ఉందని.. సమీపంలో జనావాసాలను ఎలా అభివృద్ధి పరుస్తారని నేవీ ప్రశ్నించిందని.. జగన్ ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు.శత్రుదేశాలకు విశాఖపట్నం ప్రధాన లక్ష్యమని.. ఇక్కడ ఎన్నో పరిశ్రమలు,  కేంద్ర సంస్థలు ఉన్నాయని తెలిపిందన్నారు. కాబట్టి.. దేశభద్రత దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోకపోవడమే మేలని నేవీ అధికారులు చెప్పారట. ఒకసారి రాజధాని ఏర్పాటైతే.. ఆ  ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందని.. జనావాసాలతో కిటకిటలాడుతుందని.. దీంతో చాలా సమస్యలు ఎదురవుతాయని నేవీ ఆందోళన వ్యక్తం చేసిందని ఉమా చెప్పారు. ఐఎన్ఎస్ కళింగ వ్యూహాత్మక ప్రాంతమని.. ఇక్కడ రాజధాని ఏర్పాటుపై సాంకేతిక, భౌగోళిక అంశాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని లేఖలో ప్రస్తావించారని ఆయన చెప్పుకొచ్చారు.ఇటు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సిట్ విచారణకు సిద్ధమని.. తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు ఉమా. అదే సిట్‌తో విశాఖలో కొట్టేసిన భూములపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రధానితో భేటీలో ఏం మాట్లాడారో చెప్పాలని బొండా డిమాండ్ చేశారు. తన సన్నిహితుడు నిమ్మగడ్డ ప్రసాద్ కోసమే ప్రధానిని కలిశారని ఆరోపించారు. నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా జైల్లో ఎందుకున్నారని ప్రశ్నించారు.. అక్కడ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారుమూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్.  విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేయాలని.. మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్‌ను తరలించాలని ఆలోచన చేసింది. ఇటీవలే నిధులు కూడా విడుదల చేశారు. ఉగాది సమయానికి కార్యాలయాలను తరలించాలని భావించారు. ఓవైపు హైకోర్టులో కూడా మూడు రాజధానుల నిర్ణయంపై పిటిషన్లు దాఖలు కావడంతో తరలింపు ప్రయత్నాలు కాస్త నెమ్మదించాయి. ఇప్పుడు తాజాగా నేవీ అభ్యంతరం చెప్పిందంటూ టీడీపీ కొత్త వాదన తెరపైకి తెచ్చింది.

Related Posts