ట్రంప్ టూర్ కోసం జల్లెడ పడుతున్న సెక్యూరిటీ
ఆగ్రా టూర్ లో ట్రంప్
లక్నో, ఫిబ్రవరి 24
ఫ్యామిలీతో కలిసి రెండ్రోజుల పర్యటనకు ఈ నెల 24న ఇండియా వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... మొదటి రోజు అహ్మదాబాద్‌లో రెండో రోజు అంటే 25న ఆగ్రాలో పర్యటించబోతున్నారు. ఐతే... అహ్మదాబాద్ టూర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ట్రంప్ వెంటే ఉంటారు. ఆగ్రా పర్యటనలో మాత్రం మోదీ ఉండట్లేదని తెలుస్తోంది. ఈ పర్యటనలో ట్రంప్... తన భార్య మెలానియాతో కలిసి... తాజ్ మహల్‌ను చూడబోతున్నారు. అది ప్రేమ చిహ్నం కావడం, అలాంటి చోటికి ట్రంప్ భార్యతో కలిసి వెళ్తుండటం వల్ల... సమయంలో... వారిద్దరి వెంట ప్రధాని మోదీగానీ... అధికారులుగానీ ఎవరూ ఉండబోరని తెలిసింది. ఈ కారణంగానే ట్రంప్‌తోపాటూ... మోదీ ఆగ్రా పర్యటనకు వెళ్లట్లేదని సమాచారం..ఇక ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్ ఫ్యామిలీ కోసం గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్ రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆ హోటల్ పూర్తిగా భద్రతాధికారుల పర్యవేక్షణలోకి వెళ్లిపోయింది. రెండు వారాల నుంచీ అక్కడ తనిఖీలు, నిఘాలూ కొనసాగుతున్నాయి. ఇది వరకు అమెరికా మాజీ అధ్యక్షులైన బరాక్ ఒబామా, జార్జి బుష్ వంటి వాళ్లు స్టే చేసిన అదే హోటల్‌లోని చాణక్య సూట్‌లోనే ఇప్పుడు ట్రంప్ కూడా ఉండబోతున్నారు. రెండు వారాలుగా ఢిల్లీ పోలీసులతోపాటూ... ఎన్ఎస్జీ కమాండోలు... ఆ హోటల్‌ను చుట్టుముట్టారు. ప్రతీ ఫ్లోర్‌ను రోజూ సర్వే చేస్తున్నారు. అమెరికా రాయబార కార్యాలయ అధికారులు కూడా అదే పనిగా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇకా చాలా విషయాలున్నా... అవేవీ బయటకు చెప్పట్లేదు.... సెక్యూరిటీ సమస్య వస్తుందని.ఆ ఫైవ్ స్టార్ హోటల్‌లో 438 గదులు ఉంటాయి. ఎప్పుడూ వేర్వేరు దేశాల ప్రతినిధులు, సెలబ్రిటీలు, గెస్టులతో బిజీగా ఉంటుంది. ట్రంప్ ఫ్యామిలీతో సహా వస్తుండటంతో... హోటల్‌లోని 438 గదులనూ వారికోసం, వారితో వచ్చే అతిథుల కోసం బుక్ చేశారు. ఇప్పుడా హోటల్ దగ్గర సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉంది. కాబట్టి... అటువైపుగా రాకపోకలు లేవు. అక్కడ గుంపులుగా ప్రజలు ఉంటే ఒప్పుకోరు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ట్రంప్ ఇండియా పర్యటనలో భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడట్లేదు. ఉదాహరణకు ఆ హోటల్‌లో ఢిల్లీ పోలీసుల భద్రతతోపాటూ... అమెరికా సీక్రెట్ సర్వీస్, ఇతర ఏజెన్సీల సెక్యూరిటీ కూడా ఉంది. ట్రంప్ ఎక్కడెక్కడికి వెళ్తే... అక్కడ మూడంచెల భద్రత కల్పిస్తున్నారు.ట్రంప్ వచ్చినప్పుడు... హోటల్‌లోని ప్రతీ ఫ్లోర్‌లోనూ ఢిల్లీ పోలీసులు పహారా కాస్తారు. కాకపోతే... వాళ్లు రెగ్యులర్ ఖాకీ డ్రెస్సుల్లో కాకుండా... ప్లెయిన్ క్లాత్స్‌లో కనిపిస్తారు. ఢిల్లీ పోలీసుల సెక్యూరిటీ వింగ్... ట్రంప్ ఉండే ఫ్లోర్‌లో ఇన్నర్ కార్డన్‌గా భద్రత కల్పిస్తారు. జనరల్‌గా ఈ సెక్యూరిటీ వింగ్... ఇలా విదేశాల నుంచీ వచ్చే అతిథులకు భద్రత కల్పిస్తూ ఉంటుంది. హోటల్‌లోనీ లాబీ ఏరియా, పార్కింగ్, లాన్ ఏరియా, పూల్ ఏరియాల్లో రెండో అంచె భద్రత కల్పిస్తారు. మూడో అంచె భద్రతను పోలీసులు, జిల్లా పోలీసులతో కల్పించబోతున్నారు. హోటల్ ఎదురుగా గ్రీన్ రిడ్జ్ ఏరియా ఉంటుంది. అక్కడ ఆ రోజు మొత్తం పోలీసులే కనిపిస్తారు. ఐటీసీ మౌర్య హోటల్ పక్కన తాజ్ ప్యాలెస్ హోటల్ ఉంది. దానికి కూడా హైసెక్యూరిటీ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఎవరు ఎక్కడ నిఘా పెట్టాలి అనేది ఇంకా పోలీసులకు ఫైనలైజ్ చెయ్యలేదు. కరెక్టుగా ట్రంప్ వచ్చే టైమ్‌లో మాత్రమే ఆ వివరాలు చెబుతారట.