*"పూజలు చేయటం వలన కోరికలు తీరి శాంతి రావాలి కదా ! మరి అలా ఎందుకు జరుగటంలేదు ?"*
కోరికలను తొలగిస్తే వచ్చే శాంతి కోసం, ఆ కోరికలు నెరవేర్చమని పూజలు చేయడం ద్వారా ఫలం పొందాలని చూస్తున్నాం...
అందుకే ప్రశాంతతను ఇవ్వాల్సిన పూజలు కూడా అశాంతిగానే ముగుస్తున్నాయి...
శ్రీరాముడి నామాన్ని, రూపాన్ని పదిసార్లు తలుచుకోవడం కంటే రాముడి గుణాలు పదిసార్లు గుర్తుకు తెచ్చుకొని వాటిని ఆచరిస్తే శాంతి వస్తుంది....
భగవద్గీత పది సార్లు పఠించడం కన్నా, అందులో కొన్ని ఆచరించినా చాలు,
ఏదైనా విషయం మనకి పది సార్లు గుర్తుకు వస్తుందంటే అందులో మనకేదో ఆశ ఉందని అర్థం.
ఇది గుర్తించకుండా ఆలోచనలు ఆపడానికి మరొక సాధన ప్రక్రియను తీసుకొని, రెండింటి మధ్య ఘర్షణతో సతమతమవుతున్న మనం కోరిక తీరితే శాంతి వస్తుంది అనుకుంటున్నాం.
కానీ ఒక కోరిక తీరగానే అశాంతిని కలిగించేందుకు మరొక కోరిక సిద్ధమవుతూనేవుంది.
*సముద్రంలో అలల్లాగా పరంపరగా వచ్చే కోరికలను తీర్చుకుంటూ పోతే అవి ఎప్పటికీ శాంతించేవి కావు !*
శుభమస్తు
సమస్త లోకా సుఖినోభవంతు