YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

 రసాయనాల వ్యర్థం...గోదావరి తీర్ధం

 రసాయనాల వ్యర్థం...గోదావరి తీర్ధం

 రసాయనాల వ్యర్థం...గోదావరి తీర్ధం
అదిలాబాద్, ఫిబ్రవరి 25,
గోదావరి.. తెలంగాణ జీవనాడి. ఆ నది చుట్టే బతుకులు పెనవేసుకున్నాయి.రాష్ట్రంలో నది ప్రవేశించే బాసర మొదలుకొని భద్రాద్రి వరకు ప్రధానంగా ఐదు పాయింట్లలో వివిధ పట్టణాల్లోంచి  డ్రైనేజీ వాటర్ వచ్చి చేరుతున్నది బీడు భూములు తడిసేందుకైనా.. మన దూప తీరేందుకైనా.. అదే ప్రధాన ఆధారం. ఒకప్పుడు స్వచ్ఛమైన పాలలెక్క ఉన్న గోదారమ్మ నీళ్లు ఇప్పుడు కలుషితమవుతున్నాయి. నది పొడవునా ఎటు చూసినా చెత్తాచెదారం, విష రసాయనాలే. . రామగుండం కార్పొరేషన్  నుంచే  రోజూ 17 మిలియన్ లీటర్ల మురుగు నీరు కలుస్తున్నది. ధర్మపురి, మంచిర్యాల లాంటి పట్టణాలకైతే ఈ నదే డంపుయార్డులా మారింది. తీరం వెంట టన్నులకొద్దీ చెత్తాచెదారం, ప్లాస్టిక్  వేస్టేజ్  కుప్పలుగా పేరుకుపోతున్నది. వివిధ ఆల్కహాల్, విద్యుత్, సిరామిక్స్, పేపర్ మిల్లుల నుంచి నేరుగా కలిసే విష రసాయనాలు ఇందుకు అదనం. ఎల్లంపల్లి రిజర్వాయర్తోపాటు కాళేశ్వరం కింద వివిధ బ్యారేజీలు నిర్మించాక.. ఈ మురికి నీరు, రసాయనాలు ప్రాజెక్టు నీటిలో పేరుకుపోతున్నాయి. బాసర, ధర్మపురి, భద్రాద్రి ఆలయాలకు వచ్చే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలకు వెనుకాడాల్సి వస్తున్నది. మురికి నీటిని శుద్ధి చేశాకే నదిలోకి వదలాలని నిర్ణయించి 2006లో ‘గోదావరి జల కాలుష్య నివారణ పథకం’ కింద అప్పటి ప్రభుత్వం 34.19 కోట్ల వ్యయంతో మంచిర్యాల, రామగుండం, భద్రాచలం సమీపంలో సీవరేజీ ప్లాంట్లు నిర్మించింది. అయితే అవి నిర్వహణ లేక మూతపడ్డాయి.నిర్మల్‍ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర వద్ద ప్రతి వర్షాకాలంలో గోదావరి నదిలో వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకా బాలాపూర్ శివారులోని ‘పయనీర్ డిస్టిలరీస్ లిమిటెడ్’ అనే ఆల్కహాల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు, రసాయనాలను కాల్వల ద్వారా దిగువకు వదలడంతో ఇలా గోదావరిలో కలుస్తున్నాయి. వర్షాలు నిలిచిపోయాక సుమారు 12 కిలోమీటర్ల మేర నదిలో కెమికల్స్ నురగ పేరుకుపోతోంది.దీంతో సరస్వతి ఆలయానికి వచ్చే భక్తులు ఈ నీటిలో పుణ్యస్నానాలు చేయలేకపోతున్నారు. తప్పనిసరని మునక వేస్తే రోగాలపాలవుతున్నామని భక్తులు అంటున్నారు. ఈ నీటిని పంటపొలాలకు పెడితే ఎదుగుదల తగ్గుతోందని రైతులు చెబుతున్నారు.జగిత్యాల జిల్లాలో గోదావరి తీరానగల ధర్మపురి ఒకప్పుడు పుణ్యస్నానాలకు ప్రసిద్ధి. కానీ ఇప్పుడక్కడ స్నానం అంటేనే భక్తులు భయపడుతున్నారు. కారణం ధర్మపురి పట్టణంలోని డ్రైనేజీ నీరు నేరుగా నదిలో కలుస్తున్నది. దీంతో ఇక్కడి నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయింది. మురికినీటి కారణంగా భక్తుల సంఖ్య 50శాతానికి పైగా పడిపోయిందని ఆలయ ఆఫీసర్లు చెబుతున్నారు. గతంలో గోదావరిలో డ్రైనేజీ నీరు ఓ పాయగా దిగువకు వెళ్లేది. మరోపాయలో నీరు కాస్త బెటర్గా ఉండేది. కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో బ్యాక్ వాటర్ ధర్మపురిని ఆనుకొని ఉంటున్నది. దీంతో డ్రైనేజీ నీరంతా ముందుకు కదలకుండా అక్కడే నిలిచిపోతున్నది. ఫలితంగా ధర్మపురి గోదావరి తీరం మురికికూపాన్ని తలపిస్తున్నది. మెగా డ్రైనేజీని నిర్మించి, మురికినీటిని మళ్లిస్తామని సీఎం కేసీఆర్ చెప్పినా ఆ దిశగా పనులు మాత్రం ముందుకుసాగడం లేదు.మంచిర్యాల పట్టణం నుంచి వచ్చే డ్రైనేజీ నీరు రాళ్లవాగు ద్వారా గోదావరిలో నేరుగా కలుస్తున్నది. అంతేకాదు, మున్సిపాలిటీకి గోదావరే డంప్యార్డుగా తయారైంది. పట్టణం నుంచి రోజూ వెలువడే 50 టన్నుల చెత్తను నదిలోనే డంప్  చేస్తున్నారు. బొగ్గుబావులతోపాటు పవర్ ప్లాంట్లు, సిరామిక్స్ పరిశ్రమలు, ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుల్లోని వ్యర్థజలాలు నదిలోనే కలుస్తున్నాయి. జంతువుల కళేబరాలు, హాస్పిటళ్ల నుంచి వెలువడే బయోమెడికల్ వేస్టేజీని నదిలోనే పడేస్తున్నారు. ఇటీవల నీటిమట్టం తగ్గడంతో నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్  వ్యర్థాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మేడారం సమ్మక్క-–సారలమ్మ జాతర కోసం బ్లేడ్ ట్రాక్టర్తో వీటిని తొలగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు.సుమారు 3 లక్షల జనాభా గల రామగుండం కార్పొరేషన్  నుంచి రోజుకు 17 మిలియన్ లీటర్ల  డ్రైనేజీ వాటర్ నేరుగా గోదావరిలో కలుస్తున్నది. సింగరేణి అవసరాలకు వాడే  ఫిల్టర్ బెడ్కు, కార్పొరేషన్ తాగునీటి అవసరాలకు వాడే ఫిల్టర్ బెడ్కు మధ్యలో ఈ మురికికాల్వ ఉంది. గతంలో ఈ డ్రైనేజీని వాగులో ఓ పాయగా దిగువకు వదిలి, మరోపాయ నుంచి వచ్చే మంచినీటిని ఫిల్టర్బెడ్ల ద్వారా తాగునీటి అవసరాలకు తీసుకునేవారు. కానీ దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంతో మురికి నీరంతా బ్యాక్ వాటర్లో నిలిచిపోతున్నది. ఆ మురికి నీటినే ఫిల్టర్ చేసి, కార్పొరేషన్  ప్రజలకు అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. 2‌‌‌‌006లో సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్‌‌ రివర్‌‌ కన్జర్వేషన్‌‌ ప్రాజెక్ట్‌‌ (ఎన్‌‌ఆర్‌‌సీపీ) కింద గోదావరి నది ఒడ్డున రామగుండం, మల్కాపురం  ప్రాంతాలలో సుమారు రూ. 5 కోట్ల వ్యయంతో సీవరేజ్‌‌ ట్రీట్‌‌ మెంట్‌‌ ప్లాంట్ల (ఎస్‌‌టీపీ)ను నెలకొల్పింది. 2014  వరకు బాగానే పనిచేసినా తర్వాత విద్యుత్‌‌ చార్జీలు, నిర్వహణ చార్జీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో అవి మూతపడ్డాయి.భద్రాచలం ప్రాంతంలో రోజుకు 70 మిలియన్‍ లీటర్ల మురికినీరు, 25 టన్నుల చెత్త గోదావరిలో కలుస్తున్నది.  భద్రాచలం ఎగువన  ఐటీసీ పీఎస్‍పీడీ(కాగితపు పరిశ్రమ), హెవీ వాటర్ ప్లాంట్‍తదితర ఇండస్ట్రీస్ పెద్దమొత్తంలో వ్యర్థాలను నదిలోకి వదులుతున్నాయి. పేపర్ తయారీలో 40 రకాల రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఫలితంగా తెల్లని నురగ రూపంలోని కెమికల్స్ తాళ్ల గొమ్మూరు వద్ద నేరుగా గోదావరిలో కలుస్తున్నాయి. వీటికి తోడు భద్రాచలం  పట్టణంలోనమెయిన్ డ్రైన్ను నదిలోకే మళ్లిస్తున్నారు. మురికి నీటిని శుద్ధి చేశాకే గోదావరిలోకి వదలాలనే ఉద్దేశంతో  ప్రజారోగ్యశాఖ రూ. 3.10 కోట్లతో 2004 నాటికి నిర్మించిన సీవరేజ్ ప్లాంట్ ఏడాదికే  మూతపడింది

Related Posts