YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

భస్మాసూరుడి పెద్దన్నచంద్రబాబు

భస్మాసూరుడి పెద్దన్నచంద్రబాబు

భస్మాసూరుడి పెద్దన్నచంద్రబాబు
తాడేపల్లి ఫిబ్రవరి 25, 
రాష్ట్ర చరిత్రలో ఒక విఫల నాయకుడు చంద్రబాబు నాయుడు. తన ఐదేళ్ల పాలనపై ఆత్మపరిశీలన చేసుకోకుండా సీఎం జగన్ ను నరకాసురుడని విమర్శలు చేయడం దారుణమని వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్ లో నరకాసురుడు పాలన కనిపిస్తుందా. చంద్రబాబు అవినీతి ని బైట పెట్టిన జగన్మోహన్ రెడ్డి లో నరకాసుడు కనిపిస్తున్నాడా అని ప్రశ్నించారు. 9 నెలల్లో రాజన్న రాజ్యాన్ని మించిన జగనన్న రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చారు. చంద్రబాబుది భస్మాసురా హస్తం. భస్మాసురుడికి పెద్దన్న చంద్రబాబు నాయుడు. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రం మొత్తం తగలబడి పోయింది. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే అర్హత చంద్రబాబుకు లేదు. జనాలు లేక జన చైతన్య యాత్రలు వెల వెల బోతున్నాయి. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి నాలుగు మంచి సలహాలు చెప్పారా. స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఎన్నికలు వాయిదా వేయించాడనికి చంద్రబాబు సిద్ధమయ్యారని అన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ను డామేజ్ చేస్తున్నారు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే ఎందుకు సిట్ కు భయపడుతున్నారు. సిట్ ఏర్పాటు తో టీడీపీ నేతలు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. చంద్రబాబు జనాదారణ లేని జనచైతన్య యాత్రలు చేస్తున్నాడు. జగన్ దేశంలో ఎవరూ ఇవ్వలేని జనరంజక పాలన అందిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలో కరువు కటకాలతో  ఉండేది. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం సస్యశ్యామలంగా మారింది. స్థానిక ఎన్నికలకు టీడీపీకి అభ్యర్థులు లేక ఎన్నికలను అడ్డుకుంటున్నారు. లిటికేషన్ లు పెట్టి కోర్టుల్లో వాయిదాలు వెయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు బిసిల రాజకీయ అవకాశాల్ని ఊచకోత కొస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను అనగదొక్కారు.. ప్రతిపక్షంలో కూడా అదే పని చేస్తున్నారు. తప్పు చేశారు కనుకే సిట్ ని తప్పు పడుతున్నారు.. తప్పు చెయ్యనప్పుడు భయం ఎందుకని నిలదీసారు. 

Related Posts