YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

మన దేశానికి వచ్చి పాకిస్తాన్ ను పొగుడుతాడా? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

మన దేశానికి వచ్చి పాకిస్తాన్ ను పొగుడుతాడా?  ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

మన దేశానికి వచ్చి పాకిస్తాన్ ను పొగుడుతాడా?
          ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
హైదరాబాద్ ఫిబ్రవరి 25
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయితే కావచ్చు కానీ మన దేశానికి వచ్చి పాకిస్తాన్ ను పొగుడుతాడా? ఇదేమి అన్యాయం అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో మాట్లాడిన ట్రంప్ పాకిస్తాన్ ను ఆకాశానికెత్తేశాడు. పాకిస్తాన్ తో అమెరికా సంబంధాలు ఎంతో బాగున్నాయని ఆయన చెప్పడం ఒక్క సారిగా భారత ప్రజలను  నిర్ఘాంత పోయేలా చేసింది.పాకిస్తాన్ తో మా సంబంధాలు ఎంతో మెరుగుగా ఉన్నాయి. దక్షిణాసియా లోని అన్ని దేశాలూ కలిసి మెలిసి ఉంటాయని భావిస్తున్నాము. ఉద్రిక్తతలు తగ్గి శాంతి నెలకొనాలి అని ట్రంప్ అన్నాడు. ట్రంప్ భక్తులు ఈ వ్యాఖ్యలపై ఎలాంటి కామెంటు చేయరేంటి అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సబర్మతీ ఆశ్రమానికి వెళ్లి అక్కడ మహాత్మాగాంధీ గురించి ప్రస్తావించకపోవడం అన్యాయమని మరి కొందరు విమర్శలు గుప్పించారు. సబర్మరీ ఆశ్రమానికి వెళితే ఎవరికైనా మహాత్మా గాంధీ గుర్తుకు వస్తారు. ట్రంప్ కు మాత్రం
గాంధీ గుర్తుకురాలేదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Related Posts