YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తాజ్‌ మహల్‌ను వీక్షించడానికి మరొకసారి వస్తా: ట్రంప్

తాజ్‌ మహల్‌ను వీక్షించడానికి మరొకసారి వస్తా: ట్రంప్

 తాజ్‌ మహల్‌ను వీక్షించడానికి మరొకసారి వస్తా: ట్రంప్
ఆగ్రా ఫిబ్రవరి 25
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని భార్య మెలానియాలు  తాజ్ మహల్‌ అందాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఆగ్రాలోని కట్రా ఫులెల్‌కు చెందిన నితిన్ తాజ్ మహల్ ఘనతను, దాని వెనుకనున్న ప్రేమ కథను గైడ్ ట్రంప్‌కు వివరించారు. ఈ సందర్భంగా ట్రంప్, మెలానియాలు అతను చెబుతున్నదానిని శ్రద్ధగా విన్నారు. దీనిపై గైడ్ నితిన్‌ మాట్లాడుతూ.. ట్రంప్‌ దంపతులు తాజా మహల్‌ను చూసి సంతోషం వ్యక్తం చేశారన్నారు. అదొక అద్భుత కట్టడం అని ట్రంప్‌ దంపతులు పేర్కొన్నట్లు మరొకసారి తాజ్‌ మహల్‌ను వీక్షించడానికి వారు వస్తామని తెలిపారన్నారు.అయితే ఈ సందర్భంగా ఆయన తాజ్ మహల్‌లోని కీలకమైన ఒరిజినల్ సమాధి స్థలాన్ని చూడలేకపోయారు. ట్రంప్ ఎత్తు కారణంగా ఆయన లోపల పట్టరంటూ భద్రతాసిబ్బంది ఆందోళన వ్యక్తం చేయడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు సమాచారం.  ట్రంప్‌కు తాజ్‌మహల్ చూపించిన ప్రముఖ గైడ్ నితిన్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.  ‘‘తాజ్ మహల్ అందాలకు ట్రంప్ మంత్రముగ్దుడయ్యారు. అయితే మొఘల్ రాజు షాజహాన్, ఆయన సతీమణి ముంతాజ్‌ల అసలు సమాధులను మాత్రం ఆయన చూడలేకపోయారు.ఒరిజినల్ సమాధుల వద్దకు వెళ్లే దారి ఇరుకుగా, ఎత్తు తక్కువగా ఉండడంతో  ఆయన లోపలికి వెళితే గాయపడతారని భద్రతా సిబ్బంది కంగారుపడ్డారు..’’ అని వెల్లడించారు. గత ఏడాది వైట్ హౌస్ వెల్లడించిన ఫిజికల్ ఎగ్జామినేషన్ వివరాల ప్రకారం... ట్రంప్ ఎత్తు ఆరు అడుగుల మూడు అంగుళాలు. దీంతో భద్రతా సిబ్బంది చెప్పినట్టు ఆయన అసలు సమాధులను చూడడానికి వెళితే కచ్చితంగా ఇబ్బంది పడేవారే!

Related Posts