ఇంటి చెంతకే విద్యాదీవెన కార్డులు సంతోషంలో తల్లిదండ్రులు
మంత్రాలయం ఫిబ్రవరి 25
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విద్య, వసతి దీవెన కార్డులను మండల పరిధిలోని సూగూరు గ్రామంలో వాలటీర్ల్లు ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లులకు కార్డులను అందజేశారు. సూగూరు గ్రామంలో దాదాపుగా 58 మంది విద్యార్థులకు విద్యా దీవెన,వసతి దీవెన పథకాలకు విద్యార్థులు ఎంపికయ్యారు. దీంతో అర్హులైన విద్యార్థుల ఇండ్లకు వెళ్ళి వాలంటీర్లు సలాం ,వెంకటేష్,నాగరాజు, సుంకప్ప తదితర వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి తల్లులకు కార్డులను అందజేశారు. మంత్రాలయం మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గ్రామ వాలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లి విద్యా దీవెన కార్డులను విద్యార్థుల తల్లులకు అందజేశారు. తమ పిల్లల ఉన్నత చదువుల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన,వసతి దీవెన పథకాల ద్వారా ఇంటింటికి వచ్చి అందజేస్తున్నందుకు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.