YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

అంగరంగ వైభవంగా జగద్గురు పట్టాభిషేక మహోత్సవం.      

అంగరంగ వైభవంగా జగద్గురు పట్టాభిషేక మహోత్సవం.      

అంగరంగ వైభవంగా జగద్గురు పట్టాభిషేక మహోత్సవం.                 
వారం రోజుల పాటు గురువైభవోత్సవాలు 
మంత్రాలయం ఫిబ్రవరి 25  
 జగద్గురువు  రాఘవేంద్ర స్వామి  గురు వైభవోత్సవాలు  మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.  ఇందులో భాగంగా  పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో  రాఘవేంద్ర స్వామి  పట్టాభిషేక  మహోత్సవం  పీఠాధిపతులు ఆధ్వర్యంలో  అర్చకులు అధికారులు  వైభవంగా ప్రారంభించారు.  మంగళవారం ఉదయం స్వామి వారి మూల బృందావనానికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  నిర్మాల్యము , పంచామృతాభిషేకం  స్వర్ణకవచ సమర్పణ, పుష్పాలంకరణ, మంగళహారతి సమర్పించారు.  అనంతరం  శ్రీ రాఘవేంద్ర స్వామి 399 పట్టాభిషేక మహోత్సవం ఘనంగా  ప్రారంభమయ్యాయి. ఈ వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలలో  మంగళవారం పాదుకా పట్టాభిషేక కారిక్రమాన్ని  పీఠాధిపతులు ఘనంగా ప్రారంబించారు. రాఘవేంద్ర స్వామి 399  పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా   జగద్గురువు బంగారు పాదుకలకు  విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి పాదుకలను బంగారు సింహాసనంపై కొలువుంచి  పీఠాధిపతులు ముత్యాలు,నాణేలు పుష్పాలతో అభిషేకించారు. అనంతరం  స్వామివారి బంగారు పాదుకలను  భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామివారి పాదుకలను బంగారు రథోత్సవం పై కొలువుంచి మంగళ హారతులు సమర్పించి అశేష జనవాహిని మధ్య శ్రీ మఠం మాడవీధుల్లో అంగరంగ వైభవంగా  ఊరేగించారు. ఈ కార్యక్రమానికి రాఘవేంద్ర స్వామి భక్తులు దేశం  నలుమూలల నుండి హాజరయ్యారు. కర్ణాటక బ్యాంక్ చైర్మన్ మహాబలేశ్వర బట్ తదితరులను  పీఠాధిపతులు శాలువా, మెమెంటో మంత్రాక్షితలు ఇచ్చి  ఆశీర్వదించారు.  భక్తులు పీఠాధిపతి ఆశీర్వచనాలు అందుకున్నారు. భక్తులకు పీఠాధిపతులు ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. అంతకుముందు రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర గురించి పట్టాభిషేక విశిష్టత గురించి భక్తులకు తెలియజేశారు. రాఘవేంద్ర స్వామి 425 వ జన్మదిన కార్యక్రమాన్ని మార్చి రెండవ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Related Posts