YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

ఆత్మీయ అతిధికి ఘనంగా వీడ్కోలు

ఆత్మీయ అతిధికి ఘనంగా వీడ్కోలు

ఆత్మీయ అతిధికి ఘనంగా వీడ్కోలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25  
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రెండు రోజుల పర్యటన ముగించుకొని స్వదేశానికి బయిలు దేరారు.  సోమవారం అహ్మదాబాద్ లో ట్రంప్ ఫ్లయిట్ దిగిన దగ్గర నుంచి.. మంగళవారం  రాత్రి వీడ్కోలు చెప్పేవరకు జనం నీరాజనాలు పలికారు.  భారతదేశంలోని ఆతిధ్యంతో  ఉబ్బితబ్బిబ్బువుతున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సతీమణి మెలానియాతో కలిసి మంగళవారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్ముడికి నివాళులర్పించారు. సమాధి వద్ద పుష్ఫ గుచ్ఛం ఉంచి.. ఒక ప్రదక్షిణ చేసిన ట్రంప్, మెలానియాలు ఒక్క నిమిషం పాటు మౌనం పాటించి, స్మృత్యంజ‌లి ఘటించారు. ఈ సందర్భంగా సందర్శకుల పుస్తకంలో సంతకం చేసిన ట్రంప్.. సార్వభౌమ, అద్భుతమైన భారతదేశం వెంట అమెరికా ప్రజలు బలంగా నిలబడతారు.. ఇది మహాత్మా గాంధీ దూరదృష్టికి నిదర్శనం... ఇదే ఆయనకిచ్చే గొప్ప గౌరవం’ అంటూ రాశారు.ట్రంప్, మెలనియా దంపతులకు అధికారులు రాజ్‌ఘాట్ గురించి వివరించారు. వీరివెంట కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాగా.. మహాత్మాగాంధీ జ్ఞాపికను ఆయన అందజేశారు. అనంతరం రాజ్ ఘాట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొక్కను నాటారు.  అనంతరం అక్కడ నుంచి బయలుదేరిన ట్రంప్ దంపతులు.. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఢిల్లీలోని ప్రభుత్వ  పాఠశాలను సందర్శించారు.దక్షిణ మోతీబాగ్‌ ప్రాంతంలోని సర్వోదయ కో ఎడ్యుకేషనల్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌కు వచ్చిన మెలానియాకు విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.   మెలానియా నుదుట కుంకుమ దిద్ది సంప్రదాయ పద్ధతిలో ఆమెను స్వాగతించారు. అనంతరం పాఠశాలలోని చిన్నారులతో మెలానియా ముచ్చటించారు. ఇక్కడి హ్యాపీనెస్‌ తరగతులకు హాజరయ్యారు. తరగతి గదిలో కూర్చుని హ్యాపీనెస్‌ పాఠాలు విన్నారు.

Related Posts