YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఆరు  

 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఆరు  

 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
తెలుగు రాష్ట్రాల్లో ఆరు  
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 
రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ ఖాళీ అయ్యే 55 రాజ్యసభ స్థానాలకు మార్చి 26న పోలింగ్ జరగనుంది. మొత్తం 17 
రాష్ట్రాల్లో 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు మార్చి 6న 
నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంండగా.. మార్చి 13 తుది గడువుగా పేర్కొన్నారు. మార్చి 16న అభ్యర్థుల నామినేషన్ల 
పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 18 తుది గడువు. మార్చి 26న 55 స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తారు.ఆయా రాష్ట్రాల శాసనసభల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు లెక్కింపు చేపడతారు. కాగా, తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహనరావుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. దాంతో ఆ రెండు స్థానాలకు ఎన్నిక జరగనుంది. అలాగే ఏపీ కోటాలో ఎన్నికయిన కేశవరావు పదవీకాలం కూడా ఏప్రిల్‌లోనే ముగుస్తుంది. ఆయనతోపాటు తోట సీతారామలక్ష్మీ, టి. సుబ్బరామి రెడ్డి, మొహమ్మద్‌ అలీ ఖాన్‌ పదవీకాలం ముగియడంతో ఆ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి.రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అంటారు. ఈ సభలో సభ్యుల సంఖ్య 250 కాగా, వీటిలో 12 స్థానాలను వివిధ రంగాల్లో ప్రసిద్ధులైనవారితో రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఈ సభలో సభ్యుల పదవీ కాలం ఆరేళ్లు కాగా, ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. అందుకే ఇది శాశ్వత  సభ.లోక్‌సభ మాదిరిగా రాజ్యసభ రద్దు కాదు. దీనికి కూడా శాసనాధికారం ఉంటుంది. అయితే ఆర్థిక బిల్లులకు సంబంధించి మాత్రం రాజ్యసభ నిర్ణయాన్ని లోక్‌సభ తిరస్కరించే అధికారం ఉంది. ఇతర బిల్లుల విషయంలో ఇరు సభల మధ్యా వివాదం తలెత్తితే సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు. అయితే రాజ్యాంగ సవరణకు సంబంధించిన విషయాల్లో రెండు సభల్లోనూ అంగీకారం పొందితేనే అది సాధ్యపడుతుంది.

Related Posts