YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 సెలెక్ట్ కమిటీ చుట్టూ ముదురుతున్న వివాదం

 సెలెక్ట్ కమిటీ చుట్టూ ముదురుతున్న వివాదం

 సెలెక్ట్ కమిటీ చుట్టూ ముదురుతున్న వివాదం
విజయవాడ, ఫిబ్రవరి 26
ప్రస్తుతం శాసనమండలిలో వివాదమంతా సెలెక్ట్ కమిటీ చుట్టూనే తిరుగుతోంది. అయితే ఈ వివాదం ఇంతవరకూ తేలలేదు. గవర్నర్ వద్ద ఉంది. తన వద్దనే ఉన్న విషయాన్ని మాత్రం శాసనమండలి ఛైర్మన్ పెండింగ్ లో పెట్టేశారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవడం లేదు. శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే ఇంతవరకూ కేంద్రం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ కారణంగా శాసనమండలి లైవ్ లో ఉన్నట్లే.అయితే గత శాసనమండలి సమావేశాల్లో ముగ్గురు సభ్యుల విషయంలో మండలి ఛైర్మన్ షరీఫ్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. శాసనమండలి సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు పోతుల సునీత, శివనాధ్ రెడ్డిలు పార్టీ విప్ ను థిక్కరించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు వీరిపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారు. వీరిలో పోతుల సునీత నేరుగా వైసీపీలో కూడా చేరిపోయారు.ఇక టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాసనమండలి సమావేశాలకు కూడా ఆయన గైర్హాజరయ్యారు. ముఖ్యమైన సీఆర్డీఏ, అధికార వికేంద్రీకరణ బిల్లు శాసనమండలిలో ప్రవేశపెట్టే సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ సభకు రాకపోవడంతో ఆయన పార్టీ మారడం ఖాయమనుకున్నారు. కానీ ఆయన ఏ పార్టీలో చేరకపోయినప్పటికీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.శాననమండలి ఛైర్మన్ షరీఫ్ మాత్రం సెలెక్ట్ కమిటీ విషయంలో చూపిన శ్రద్ధ అనర్హత వేటు, రాజీనామాలపై పెట్టడం లేదంటున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ కూడా అనర్హత వేటు విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఎటూ శాసనమండలి రద్దు అవుతుందన్న భావనతో పట్టించుకోవడం లేదా? లేక అసలు తాము అనర్హత వేటు వేయాలని ఇచ్చిన పిటీషన్ ను మర్చిపోయారా? అన్న అనుమానం కలుగుతోంది. మొత్తం మీద మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో షరీఫ్ వీటిపై ఇంకా దృష్టి సారించలేదు.

Related Posts