YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

కంబాలా వీరులకు సినిమా చాన్స్

కంబాలా వీరులకు సినిమా చాన్స్

కంబాలా వీరులకు సినిమా చాన్స్
బెంగళూర్, ఫిబ్రవరి 26,
కంబాలా పోటీల్లో ఉసేన్ బోల్ట్ నే మించి పరుగెత్తి.. రాత్రికి రాత్రే హీరోలుగా మారిన కంబాలా జాకీలు శ్రీనివాస్ గౌడ, నిశాంత్ శెట్టి, ఇతరులకు సినిమా చాన్స్ వచ్చింది. కంబాలా ఆట కథతో కన్నడ ఫిల్మ్ డైరెక్టర్ నిఖిల్ మంజు తెరకెక్కిస్తున్న సినిమాలో ఈ సీజన్ లో టాప్ ఐదుగురు జాకీల పాత్రలు కూడా ఉండనున్నాయి. ఆ పాత్రల్లో ఆయా జాకీలే నటించనున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో150 ఏండ్ల క్రితం జరిగిన యదార్థ కథ ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నామని, ఇందులో కంబాలా టాప్ జాకీలు మిజారు శ్రీనివాస్ గౌడ, బజగోలి నిశాంత్ శెట్టి, హక్కారి సురేశ్ శెట్టి, ఆనంద్ ఇర్వత్తూర్, ప్రవీణ్ కోటన్ పాత్రలు కూడా ఉంటాయని డైరెక్టర్ వెల్లడించారు. కంబాలా పోటీలు మరో రెండు వారాల పాటు జరగనున్నాయని, మధ్యలో మూడు రేసులు రద్దయ్యాయని, ఆ సమయంలో తాము ఒరిజినల్ లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నామన్నారు.

Related Posts