YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మానవతా దృక్పథంతో వ్యవరించండి సీఎం జగన్ మోహన్ రెడ్డి

మానవతా దృక్పథంతో వ్యవరించండి సీఎం జగన్ మోహన్ రెడ్డి

మానవతా దృక్పథంతో వ్యవరించండి సీఎం జగన్ మోహన్ రెడ్డి
నంద్యాల, ఫిబ్రవరి 25
భూసేకరణ సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం అమరావతి సచివాలయం కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన, పేదలందరికీ ఇల్లు, వైయస్సార్ పెన్షన్, గ్రామ, వార్డు సచివాలయం, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, దిశ పోలీస్ స్టేషన్లు తదితర వాటిపై సీఎం జగన్‌ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా జిల్లాల వారీగా ఇళ్ల స్థలాల ప్రగతిని సీఎం జగన్‌ సమీక్షించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే రూపంలో మనం మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఎవరి ఉసురూ తగలకూడదు. నా మాటగా చెబుతున్నా. భూ సేకరణ సమయంలో కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారిని సంతోష పెట్టి భూమిని తీసుకోవాలి. అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి తీసుకోవాలన్నారు.  ఫలానా కలెక్టర్‌ అన్యాయంగా తీసుకున్నాడు.. అనే మాట నాకు ఎక్కడా వినిపించకూడదు’అంటూ 13 జిల్లాల ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఫిబ్రవరి 25 నాటికల్లా లేఅవుట్ పూర్తి చేయాలన్నారు. పేదలకిచ్చే ఇంటి పట్టాలు సంబంధించి మార్చి ఒకటో తేదీ నాటికి భూములను చదును చేయడం, ప్లాటింగ్,  మార్కింగ్ తదితర పనులన్నీ పూర్తి చేయాలన్నారు. నవరత్నాలు లో భాగంగా వైఎస్ఆర్ నవశకం రైస్ కార్డ్, పెన్షన్ రీ వెరిఫికేషన్ లిస్ట్ గ్రామ, వార్డు సచివాలయం లో ప్రదర్శించి వెంటనే సోషల్ ఆడిట్ చేయాలన్నారు. మార్చి ఒకటో తేదీ నాడు కొత్తవారికి పెన్షన్ తో పాటు పెన్షన్ కార్డు లబ్ధిదారులకు వాలింటర్ ద్వారా అందజేయాలన్నారు. హౌస్ హోల్డ్ మ్యాప్ రెండు మూడు రోజుల్లో 100% పూర్తి చేయాలన్నారు *గ్రామ, వార్డు సచివాలయం లో స్పందన కు వచ్చిన అర్జీదారులకు రసీదులను అందజేసి ఎన్ని రోజులలో పరిష్కారం అవుతుందో తెలియపరిచి, పరిష్కారం చేసిన అనంతరం లబ్ధిదారుల నుంచి పరిష్కారమైనట్లు తిరిగి రసీదు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయలును అన్ని జిల్లాల కలెక్టర్లు మానిటరింగ్ చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడాలన్నారు. గ్రామ, వార్డు  సచివాలయంలో పనిచేసే సచివాలయ ఉద్యోగులు, వాలెంటర్ల్లు బయోమెట్రిక్ కచ్చితంగా ఉండాలి అన్నారు. మహిళా సంరక్షణ పోలీస్‌లు, మహిళా పోలీస్‌ మిత్రాలు చురుగ్గా ఉండాలన్నారు. మీ గ్రామంలో ఎవరైనా, ఎక్కడైనా  ఇల్లీగల్‌ లిక్కర్‌ అమ్ముతున్నారంటే వాళ్లకు సింహ స్వప్నం కావాలన్నారు. మీరు ఒక్క మెసేజ్‌ కొడితే ఎస్పీ అలర్ట్‌ అవుతారు. పోలీసులను పంపించి క్లీన్‌ చేసేస్తారు. గ్రామంలో ఎలాంటి తప్పులు జరుగుతున్నా వెంటనే మీరు అలర్ట్‌ అయ్యి రిపోర్టు చేయాలన్నారు      సీఎం వైయస్‌.జగన్ మోహన్ రెడ్డి, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్‌ ఫ్రీ నంబర్‌ ప్రచార వీడియో సందేశంతో నిండిన వీడియోలను సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో విడుదల చేశారు.ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకుసూచించారు. నా స్థాయిలో, అధికారుల స్థాయిలో 50శాతం తగ్గితే, మిగిలిన యాభైశాతం తగ్గించడానికి అధికారులు పూర్తిస్థాయిలో ధ్యాస పెట్టాలన్నారు*స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారి రవి పట్టన్ షెట్టి, ఎస్పీ డాక్టర్ కే పకీరప్ప జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.   జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ఉగాది నాడు పేదలకు ఇచ్చే ఇంటి పట్టాల భూములను చదును, లేఅవుట్లు, ప్లాటింగ్, మార్కింగ్ పనులన్నీ 50 శాతం పూర్తయ్యాయిని, *ఈ నెల చివరిలోగా హౌస్ సైట్ డెవలప్మెంట్ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్ కే పకీరప్ప మాట్లాడుతూ దిశ పోలీస్ స్టేషన్ పనులన్నీ వారం లోపు పూర్తి చేస్తామని సీఎంకు వివరించారు. దిశ పోలీస్ స్టేషన్లో స్టాఫ్ నియామకం 100% పూర్తయిందన్నారు.

Related Posts