YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఇంటర్ విద్యార్థులకు ఫీజుల, హజరు పేరుతో..  హాల్ టిక్కెట్లు ఇవ్వని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి: పిడి యస్ యు

ఇంటర్ విద్యార్థులకు ఫీజుల, హజరు పేరుతో..  హాల్ టిక్కెట్లు ఇవ్వని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి: పిడి యస్ యు

ఇంటర్ విద్యార్థులకు ఫీజుల, హజరు పేరుతో..
 హాల్ టిక్కెట్లు ఇవ్వని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి: పిడి యస్ యు
నంద్యాల, ఫిబ్రవరి 25 
పరీక్ష ఫీజు కట్టిన ప్రతి ఒక విద్యార్థికి హాల్ టికెట్ ఇవ్వాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ డీ ఎస్ యూ) జిల్లా సహాయ కార్యదర్శి యస్ యమ్ .డి.రఫీ హెచ్చరించారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశంలో రఫీ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులు నుంచి కండోనేషన్ ఫీజును అక్రమంగా వసూలు చేస్తు హాజరు తకువున విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలంటే తప్పని సరిగా ఫీజులు చెల్లించాలి దీనిని ఆసరాగా చేసుకుని అధిక ఫీజులను వసూలు చేస్తు విద్యార్థులను ఆందోళనకి గురి చేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  మరి కొద్ది రోజుల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతుండగా ఇలాంటి సమయములో లో హాల్ టికెట్స్ రాకపోవడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. పరీక్షకు హాజరు కావాలంటే కనీసం 75 శాతం ఉంటేనే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి అంతకంటే 60 నుండి 74 శాతం కంటే తక్కువ హాజరు శాతం తక్కువగా ఉంటే హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాకాపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.దీనిపై ఆర్ఐఓ  స్పందించాలని పీ డీ యస్ యూ  విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలి పిడి యస్ యు .ఫిబ్రవరి    4 నుంచి ప్రారంభమై ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు ,  అధిక ఎండను దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు ప్రథమ చికిత్సా ,సౌకర్యం, ఫ్యాన్లు ,లైట్లు ,బెంచీలు, ఏర్పాటు చేయాలని  ,ఆర్టీసీ అధికారులు స్పందించి పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు తగిన సమయానికి నడపాలని కోరారు .విద్యార్థులకు సమస్యలు లేకుండా చూడాలని కోరారు . ఈ కార్యక్రమంలో పిడి యస్ యు డివిజన్  అధ్యక్షుడు దస్తగిరి,  వంశీ,మహేంద్ర,బాషా,నాయక్,సుభాష్ .సురేష, మొదలైన వారు పాల్గొన్నారు.

Related Posts