YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు నీచసంస్కృతి మానుకుంటే మంచిది

చంద్రబాబు నీచసంస్కృతి మానుకుంటే మంచిది

చంద్రబాబు నీచసంస్కృతి మానుకుంటే మంచిది
తాడేపల్లి ఫిబ్రవరి 26 
చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రజాచైతన్యయాత్ర పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు. మూడు సార్లు సిఎంగా చేసిన వ్యక్తి ఇలాగేనా వ్యవహరించేదని ప్రభుత్వవిప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు అసైన్డ్ ల్యాండ్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. పేదప్రజలకు ఒక్క గజం స్ధలం అయినా పంచావా అని నిలదీసారు. 15 ఏళ్లు సిఎంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా భూమి పంపిణి చేశావా. రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత ఉందా చందబాబూ. చంద్రబాబు హంద్రీనీవాను కేవలం ఐదు టిఎంసిలకు పరిమితం చేశారు. హంద్రీనీవాకు చంద్రబాబు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు.వైయస్ రాజశేఖరరెడ్డి తన ఐదేళ్ల కాలంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ ను నీ జిఓలను చించివేసి తిరిగి 40 టిఎంసిలకు చేసి అనంతపురం ప్రజలకు దేవుడిలా నిలిచారు. -దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు అనంతపురం జిల్లాకు హార్టికల్చర్ వచ్చింది.అది వైయస్ చలవ కాదా. 15 ఏళ్లు గ్రాఫిక్స్ తో చంద్రబాబు కాలం గడిపారు. సిఎం  వైయస్ జగన్ పై ఎన్ని వ్యాఖ్యలు చేసినా మౌనంగా భరిస్తున్నాం. చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారు.  చంద్రబాబు హయాంలో ప్రతిపక్షఎంఎల్ఏలపై దాడులు జరిగాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అధికారపార్టీ ఎంఎల్ ఏలపై దాడులు చేస్తున్నారు. మీరు దౌర్జన్యాలు చేస్తే భయపడతామని అనుకుంటున్నారా. చంద్రబాబు నీచసంస్కృతి మానుకుంటే మంచిదని 

అన్నారు.

Related Posts