YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా ముగిసిన ''బాలాలయ సంప్రోక్షణ''

ఘనంగా ముగిసిన ''బాలాలయ సంప్రోక్షణ''

ఘనంగా ముగిసిన ''బాలాలయ సంప్రోక్షణ''
తిరుపతి ఫిబ్రవరి 26 
తిరుప‌తిలోని శ్రీ‌వారి పాదాల మండ‌పంలోని శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ స్వామి, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారు, శ్రీ పెరియాళ్వార్‌, శ్రీ‌ భ‌క్తాంజ‌నేయ‌స్వామివారి చిత్ర‌ప‌ట్టాల‌కు బాలాలయ సంప్రోక్షణ బుధ‌వారం  ఉదయం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసింది.  ఇందులో బాగంగా  ఉద‌యం 7.30 గంట‌లకు పుణ్యాహ‌వ‌చ‌నం, ఉద‌యం 10.27 నుండి 10.59 గంట‌ల న‌డుమ ఫాల్గుణ శుద్ధ త‌దియ మేష ల‌గ్నంలో బాలాల‌య చిత్ర‌ప‌టాల‌కు కుంభ ఆవాహ‌న నిర్వ‌హించారు. ఉద‌యం 11.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. శ్రీ‌వారి పాదాల మండ‌పంలోని శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ స్వామివారి  ఆల‌యం, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి ఆల‌యం, శ్రీ పెరియాళ్వార్ ఆల‌యం, శ్రీ భ‌క్తాంజ‌నేయ‌స్వామివారి ఆలయాలకు మరమ్మత్తులు నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. 

Related Posts