YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో రీవెంజ్ పాలిటి్క్స్

ఏపీలో రీవెంజ్ పాలిటి్క్స్

ఏపీలో రీవెంజ్ పాలిటి్క్స్
విజయవాడ, ఫిబ్రవరి 27,
ఎవరూ ఏం తక్కువ తినలేదు. చంద్రబాబు హయాంలోనూ వైసీపీ నేతలపై ఇలాగే వేధింపులు జరిగాయి. అలాగే ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీపై సేమ్ టు సేమ్ రివేంజ్ మొదలయింది. అయితే అప్పట్లో చంద్రబాబు చేసిన పనులు బయటకు కనపడలేదు. సైలెంట్ గా తన పనిచేసుకుపోయారు. మీడియా మద్దతు కూడా ఉండటంతో అప్పట్లో ఇవేమీ కన్పించలేదు. ఇప్పుడు జగన్ రఫ్ హ్యాండ్ లింగ్ చేస్తున్నారు.చూసేవారికి జగన్ చంద్రబాబును ముప్పు తిప్పులు పెడుతున్నారని కన్పిస్తున్నా గతంలో చంద్రబాబు కూడా ఇదే రకమైన పాలన సాగించారని చెప్పక తప్పదు. అప్పట్లో వైసీపీ నేతలపై లెక్కలకు మించి కేసులు పెట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి వంటి వారిపై కేసులు లెక్కకు మించి నమోదయ్యాయి. గొంతెత్తితే చాలు ఎఫ్ఐఆర్ నమోదయ్యేది.ఇక సాఫ్ట్ గా చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని జగన్ ను మానసికంగా ఇబ్బందికి గురి చేశారు. ఇలా చంద్రబాబు హయాంలోనూ వైసీపీ నేతలపై అక్రమ కేసులు నమోదయ్యాయి. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు సహజంగానే దిగుతారు. దిగారు కూడా. కోడెల శివప్రసాద్ దగ్గర నుంచి నేటి అచ్చెన్నాయుడు వరకూ వారిపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వ అక్రమాలపై సిట్ దర్యాప్తు వేశారు.ఒకరకంగా చూస్తే ఇద్దరిలో ఎవరూ ఏమీ తక్కువ కాదు. ఇప్పుడు నీతులు వల్లిస్తున్న చంద్రబాబు సయితం అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకుని విపక్షాల గొంతు నొక్కారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. జగన్ అధికారంలో లేరు కాబట్టి అప్పుడు చంద్రబాబు సిట్ వేయలేదంతే. అయితే ఇప్పుడు జగన్ బాహాటంగా చేస్తున్నారు. అంతే తేడా. ఏపీ రాజకీయాలు కక్ష సాధింపు దిశగా నడుస్తున్నాయని వేరే చెప్పనక్కరలేదు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయాకే ఈ పరిస్థితి కన్పిస్తుండటం విశేషం

Related Posts